ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాకిస్తాన్ ల మధ్య పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.  రెండు దేశాల మధ్య సయోధ్య దెబ్బతిన్నది.  ఇప్పటికే అనేక ఎదురుదెబ్బలు తింటున్న పాకిస్తాన్, ఇండియాతో గొడవపెట్టుకొని మరిన్ని ఎదురుదెబ్బలు తింటున్నది.  ఇప్పటికే సమస్యల వలయంలో చిక్కుకుపోయిన పాక్, ఇండియాతో యుద్ధం చేస్తామని, జమ్మూ కాశ్మీర్ ను వదిలే సమస్య లేదని బీరాలు పలుకుతున్నది.  ఎలాగైనా ఇండియాపై అపవాదులు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపైన అభాసు పాలవుతూ వస్తున్నది.  


ఇదిలా ఉంటె, ఆర్టికల్ 370 గురించి పూర్తిగా తెలియకపోయినా ఈ పేరు మాత్రం బాగా ట్రెండ్ కావడంతో ఈ పేరుతో ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ లో డిష్ ను ఏర్పాటు చేశారు.  ఈ డిష్ పేరు చాలా వెరైటీ ఉన్నది.  పేరు వెరైటీ కాదు.. పేరు వెరైటీ గా ఉన్న ఆ డిష్ మాత్రం వెజ్ థాలి  అంట.  మన దగ్గర వెజ్ థాలి  ఎంత ఉంటుంది మహా అయితే 100 లేదంటే ఇంకా ఎక్కువ అనుకుంటే మరో వంద పెద్ద రెస్టారెంట్ అనుకుంటే.. 500 వరకు ఉంటుంది.  


కానీ, ఆ ఢిల్లీలోని ఆర్దోర్ 2.1 రెస్టారెంట్ లో ఈ వెజ్ తాళి ఖరీదు భారీగా ఉన్నది.  వెజ్ థాలి  ఖరీదు 2,370 రూపాయలు.  ఈ స్థాయిలోఖరీదంటే మామూలు మాములు విషయం కాదు.  అక్కడ భోజనం చేయాలంటే 2500 వరకు ఖర్చు చేయాలి.  అయితే, కష్టమర్లను ఆకట్టుకోవడానికి ఆ రెస్టారెంట్ వినూత్న ప్రయోగం మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన వాళ్లకు అక్కడ 370 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు.  


జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఐడి చూపిస్తే వాళ్లకు 370 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు.  ఆర్టికల్ 370 స్పెషల్ అని అంటున్నారు.  థాలి ఖరీదు ఆ స్థాయిలో ఉంటె.. దానికి డిస్కౌంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంటుంది చెప్పండి. అయితే ఆర్టికల్ 370 పేరుతో ఫేమస్ అయ్యింది కాబట్టి ఈ రెస్టారెంట్ కు మంచి పేరు వచ్చింది.  సో, మీరు కూడా వినూత్నంగా ఆలోచిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: