పదిహేను వందల ముప్పై మూడు క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ మహారాణి పదిహేను వందల యాభై ఎనిమిది నవంబర్ పదిహేడు నుండి ఆమె మరణించే వరకూ ఇంగ్లాండ్ రాణిగా ఉన్నారు. ఎలిజబెత్ పుట్టింది హీరోదే ఎనిమిదో హెన్రీ కూతురైన ఎలిజబెత్ పుట్టిన రెండేళ్ల తర్వాత ఆమె తల్లిని వదిలేశాడు. దీంతో ఆమె సింహాసనానికి వారసత్వం పోగొట్టుకుంది. కింగ్ మరణం తర్వాత వారసత్వ పోరులో కొంత కాలం జైలు పాలైంది ఎలిజబెత్. అనూహ్యంగా పాతికేళ్ల వయసులో రాణి అయ్యింది. పాలనపై తన ముద్ర వేసింది. ప్రొటెస్టెంట్ విశ్వాసాన్ని ప్రోత్సహించిన ఎలిజబెత్ పెళ్లి చేసుకోకుండానే వుండిపోయింది. ఉదారవాద విధానాలతో పేరు తెచ్చుకున్న రాణిని చంపడానికి అనేక కుట్రలు జరిగాయి. వీటన్నింటినీ ఎలిజబెత్ అణిచివేసింది. పదిహేను వందల ఎనభై ఎనిమిదిలో స్పెయిన్ తో యుద్ధంలో గెలుపును ఇంగ్లాండ్ చరిత్రలోనే గొప్ప విజయంగా చెప్పుకుంటారు.



ఎలిజబెత్ టైంలోనే షేక్ స్పియర్ క్రిస్టఫర్ మార్లో లాంటి గొప్ప రచయితలు వెలుగులోకి వచ్చారు. బ్రిటిష్ చరిత్రపై తన ముద్ర వేసిన రాణి అరవై తొమ్మిదేళ్ల వయసులో పదహారు వందల మూడు మార్చి ఇరవై నాలుగున చనిపోయింది. ఎలిజబెత్ కు వారసులు లేకపోవడంతో ఆమె మరణంతో ట్యూడర్ వంశ పాలనకు తెర పడింది. పధ్ధెనిమిది వందల పద్నాలుగు విలియనం బటర్ ఫీల్డ్ ఆర్కిటెక్చర్ లో చరిత్ర కెక్కిన ఇంగ్లిష్ ఆర్కిటెక్చర్. ఆయన పుట్టింది ఈ రోజే, ఇంగ్లాండ్ లో పుట్టిన బటర్ఫీల్డ్ ఆర్కిటెక్చర్ రంగంలో వినూత్నమైన డిజైన్ లతో సంచలనం రేపాడు. ఎక్కువగా మత కేంద్రాలు, విద్యాసంస్థల భవనాలకూ డిజైన్ చేశాడు. కొత్తగా పాలిక్రోం అనే విధానాన్ని బటర్ఫీల్డ్ తీసుకొచ్చాడు.



పెర్త్ లోని సెయింట్ నైనియన్స్ క్యాథెడ్రల్ మెల్ బోర్న్ లోని సెయింట్ పాల్స్ కెథడ్రల్ ఆక్స్ వాడి కెబెల్ కాలేజ్ లాంటి అనేక అద్భుతమైన నిర్మాణాలను ఆయన డిజైన్ చేశాడు. ఎనభై ఐదేళ్ళ వయసులో పంతొమ్మిది వందలవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడున చనిపోయాడు విలియమ్ బటర్ ఫీల్డ్. పంతొమ్మిది వందల ఇరవై ఐదు గడుసు అమ్మాయ్ నుంచి అత్తగారి దాకా అన్ని రోల్స్ లో మెప్పించిన భానుమతి గాయకురాలిగా, రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్గా అనేక పాత్రలు పోషించింది. ఆమె పుట్టింది ఈ రోజే.



ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టారు భానుమతి. తండ్రి నుంచి సంగీతం నేర్చుకున్న ఆమె స్వతంత్ర భావాలతో పెరిగారు. పదమూడేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వరవిక్రయం సినిమాలో నటించారు. సినిమాల్లో ఎదుగుతున్న టైములోనే పంతొమ్మిది వందల నలభై మూడులో నిర్మాత దర్శకుడు రామకృష్ణారావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లైలా మజ్ను, మల్లీశ్వరి, విప్రనారాయణ, చింతామణి, తెనాలి రామకృష్ణ, బాటసారి, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, మంగమ్మ గారి మనవడు లాంటి సినిమాల్ లో సహజ నటనతో మెప్పించారు భానుమతి. సినిమాల్లో తన పాటలన్నీ తనే పాడుకున్న అరుదైన నటి ఆమె. మల్లీశ్వరి లో ఆమె గళాల్ని తెలుగుజనం ఎప్పటికీ మర్చిపోలేరు



అత్తగారి కథలు, నాలో నేను అనే పుస్తకాలతో రచయిత గానూ తన ముద్ర వేశారు. తన ప్రతిభతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి రెండు వేల ఐదు డిసెంబరు ఇరవై నాలుగున కన్నుమూశారు. పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఈ ఎస్ పీఎన్ స్పోర్ట్స్ చానల్ ఈ ఎస్ పీఎన్ ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది ఈ రోజే. బిల్ రాస్ మసేజ్ ఈ ఛానెల్ ను స్టార్ట్ చేశాడు. కనెక్టికట్ లోని బ్రిస్టల్ లో దీని హెడ్ క్వార్టర్ ఉంది. ఎనభై శాతం వాటాతో వాల్ట్ డిస్నీ ఈఎస్ఎన్ స్పోర్ట్స్ చానల్ ను నడుపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: