చంద్రబాబు ఎన్నికల ముందు దేశం మొత్తం ఎలా తిరిగాడో మనం చూశాము. ఒక రోజులో కలకత్తా .. చెన్నై .. ఇటు బెంగళూరు క్షణం తీరిక లేకుండా తిరిగి పీఎం ను డిసైడ్ చేసేది నేనేనని తెగ డప్పు కొట్టుకున్నాడు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మోడీ బలం చూసి నోట్లో నుంచి మాటలు బయటికి రావడం లేదు. జాతీయ స్థాయిలో ఏం జరిగిన బాబు స్పదించడం లేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ లీడర్ చిదంబరం అరెస్ట్ అయితే పైగా అతను బాబు గారికి మంచి దోస్తు కూడా. కానీ తన ఫ్రెండ్ జైలుకు వెళితే బీజేపీ మీద విమర్శలు కూడా చేయడం లేదు . 


బాబు గారికి సత్యం బోధపడటంతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం ఆపేశారు. ఏపీలోనే తిరగడం లేదు ఇక బయట ఏం తిరుగుతుందని సెటైర్లు పడుతున్నాయి.అయితే చిదంబరంను తీహార్ జైలుకు తరలించమని ఢిల్లీ కోర్ట్ తీర్పునిచ్చింది. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు.


అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. అలాగే జైల్లో చిదంబరంకు మంచం అది కూడా పరుపు లేకుండా ఉండేది మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చారు. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇటువంటివి ఉంటాయి. మిగతా వారు అయితే కిందే పడుకోవాల్సిందేనని చెప్పారు. అయితే పరిస్థితి చూస్తుంటే చిదంబరంకు బెయిల్ వచ్చేది కష్టంగా మారింది. కేంద్రం కూడా చిదంబరం కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: