నిజం నిప్పులాంటిది,అబద్ధం ఆయస్కాంతం లాంటిదంటారు.నిప్పుకు తనపని తాను చేసుకుంటు వెళ్లడమే తెలుసు. ఆయస్కాంతం అలా కాదు అవినీతి అనే ఇనుము కనబడగానే అతుక్కుపోతుంది.ఈ విషయం ఎందుకు ఇందులోకి వచ్చిందంటే కోట్లు విలువచేసే భూమి కనిపించిందనుకో కబ్జారాయుల డేగ కళ్ళకి చటుక్కున చిక్కుద్ది.ఆ భూమి
భగవంతునిదా,భక్తునిదా,గవర్నమెంటుదా అనే ఆలోచన అవసరం లేదు.కబ్జా చేసామ లేదా అనేదే ముఖ్యం.ఇక కబ్జా చేసే భూమి మనుషులదైతే భూపోరాటం జరుగుతుంది.కాని ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారిది.మరి ఆయన స్వయంగా వచ్చి పోరాటం చేయలేడు కదా.అందుకే 80 ఏళ్లక్రితం ఓ న్యాయపోరాటానికి చిన్న బీజం వేసాడు.తనకు మొక్కులు బాకి వున్న వారినే ముక్కులు పిండి వసూలు చేసే ఏడుకొండలవారు తన భూములు అన్యాక్రాంతమవుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడని ఆలోంచించారు.ఇంతకు అసలు స్వామివారి భూములను కబ్జా చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందని కదా మీ డౌట్.సరే తెలుసుకుందాం పదండి..



వివరాల్లోకి వెళితే. అన్నమాచార్య వంశానికి చెందిన వారికి ఆకాలంలో ఇనామ్ కింద 188 ఎకరాల 32 సెంట్ల భూమిని టీటీడీ అధికారులు,అన్నమాచార్య సేవలను అభినందిస్తూ ఇచ్చిందని,ఆ భూమి తమదేనని ఇన్నాళ్లు భావించారు.వాదించారు.కాని వారు మాత్రం 1925లో టీటీడీకి అందిస్తున్నసేవలను నిలిపివేశారు.కానీ ఆ భూమిని వెనక్కి తిరిగి ఇవ్వలేదు.అంతే కాకుండా ఆ భూమిని సుబ్బారెడ్డి,గురువా రెడ్డి అనే వ్యక్తులకు లీజు కింద ఇచ్చేశారు.ఇక లీజుకు తీసుకున్న వారిలో గురువారెడ్డి అనే వ్యక్తి 1927లో ఆ భూమిని తన కుటుంబసభ్యులు పేరు మీద రిజిస్ట్రర్ చేయించడమే కాకుండా రెవెన్యూ శాఖ నుంచి పట్టా కూడా పొందాడు.దీనిపై టీటీడీ 1940లో సబ్ కలెక్టర్ ని ఆశ్రయించగా అప్పటి సబ్ కలెక్టర్ ఆ భూమి టీటీడీదేనని నిర్ధారించారు. అయినా గురువారెడ్డి కుటుంబ సభ్యులు వినలేదు.దీంతో భూవివాదం అనేక ఏళ్లుగా నడిచింది.



ఒక వైపు తాళ్లపాక వంశానికి చెందినవారు సీసీఎల్ ఏ కమిషనర్ ని కలవగా దీనిపై వెంటనే విచారణ జరిపించాలని,కమిషనర్ చిత్తూరు డిప్యూటీ తహసీల్దార్నిఆదేశించారు. దీనిపై పూర్తి విచారణ జరిపిన డిప్యూటీ తహసీల్దార్ ఆ భూములపై తాళ్లపాక కుటుంబసభ్యులకు కానీ గురువారెడ్డి కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి హక్కులు లేవని,ఆ భూములు టీటీడీకి చెందినవని
ఆగస్టు 27న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు.దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసిన 80 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది. టీటీడీకి చెందిన 188 ఎకరాల ఆలయ భూమి తిరిగి దక్కింది.తిరుపతి ప్రధాన బస్టాండ్ పక్కన వున్న ఈ  భూముల విలువ ఇప్పుడు వెయ్యి కోట్లు పై మాటేనటా ఇక 1940 నుంచి భూముల కోసం టీటీడీ చేస్తున్నపోరాటానికి 2019 లో ముగింపు దొరికింది.తిరిగి తన భూములు తన సొంతం చేసుకుంది.అందుకే అంటారు పెద్దలు చేసిన తప్పు వూరికే పోదని పాపం పండినప్పుడు చెట్టుకున్న పండులా రాలిపోవలసిందేనని.ఇప్పుడు దేవుని భూముల విషయంలో ఆదే జరిగింది...

మరింత సమాచారం తెలుసుకోండి: