సమాజంలో  రోజు రోజుకు పెరుగుతున్న నేరాల సంఖ్య చూస్తుంటే మానవుడు అభివృద్ధికంటే,వినాశనానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు అనిపిస్తుంది.ఎందుకంటే కొంతమంది చేసిన హత్యలకు అసలు ఆధారాలే వుండవు.వెతికినా దొరకవు.అవి అత్యంత కౄరంగా వర్ణించడానికి వీలులేకుండా ఉంటాయి.హత్య చేసిన వారు మాత్రం దర్జాగా తిరుగుతుంటారు. ఒకవేళ వాడి కర్మ కాలి దొరికాడనుకో తీర్పు వచ్చేలోపలే ముసలివాడై చావడమో,లేక మరేదైన కారణంతో మరణించడమో జరుగుతుంది.క్షమించరాని పెద్ద పెద్ద కేసులలోదోషి పూర్తిగా శిక్ష అనుభవించిన సందర్భాలు చాల తక్కువ.ఇక ఒక వ్యక్తి,, ఒకర్ని కాదు ఇద్దర్ని కాదు,ఏకంగా 150 మందిని టార్చర్ పెట్టి దారుణంగా చంపి,ఓ నిర్మానుష్య ప్రాంతంలో విసిరేశారు. అయితే,వారిని ఎవరు చంపారనేది ఇప్పటికీ మిస్టరీనే.తాజాగా వెలుగుచూసిన ఈ దారుణం ఆ దేశంలో చర్చనీయంగా మారింది. కనిపించకుండా పోయిన తమఆప్తులు కూడా ఈ మానవమృగం బారినపడి మరణించి ఉంటారని కొంతమంది ఆందోళన చెందుతున్నారు.ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..



గత 20 ఏళ్లలో మొత్తం 57,861 మంది ప్రజలు మిస్సయ్యారట అక్కడ నిత్యం ఎవరో ఒకరు కనిపించకుండా పోతుంటారట. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత కుటుంబికులు సోషల్ మీడియా ద్వారా ఒక బృందంగా ఏర్పడి ఆప్తుల కోసం జల్లెడ పడుతున్నారు.ఇంతలా భయం గొల్పే ఘటన జరిగింది మెక్సికోలో..ఈ కనిపించకుండా పోయిన వ్యక్తులు హత్యకు గురై వుంటారనే అనుమానంతో,నిర్మానుష్య ప్రాంతాలు, డంపింగ్ యార్డ్స్,సముద్ర తీరాల్లో అన్వేషిస్తుండగా వారి అనుమానమే నిజమవుతూ,సినాలోవాలోని కులియాకాన్ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్లకు కొద్ది దూరంలో ఉన్న ఓ డంపింగ్ యార్డు వద్ద వందలాది ఎముకలు కనిపించాయట.మొదట్లో అవి జంతువులవని భావించారు.కానీ, ఆయా పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా మనుషుల చేతులు,కాలి మడమలు కనిపించాయి.కొన్ని చేతులకు వేళ్లు కత్తిరించి ఉన్నాయి.వాటిని పరిశీలించగా సుమారు 150 మంది అస్థికలని తెలిసింది.



వీటిలో చిన్నారుల ఎముకలు కూడా ఉన్నాయని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.అక్కడ దొరికిన ఎముకలను పరిశీలించగా, భయంకర నిజాలు భయటపడ్డాయి.వారంతా చనిపోవడానికి ముందు దారుణమైన టార్చర్‌ను ఎదుర్కొని,మరణించారని తెలిసింది.బతికి ఉండగానే చేతులు,కాళ్లు తదితర శరీర భాగాలను వేరు చేసి ఉంటారని భావిస్తున్నారు.ఇది తప్పకుండా సీరియల్ కిల్లర్ చేసిన హత్యలు కావచ్చని లేదా శవాలను అక్కడ పడేసినప్పుడు జంతువులు వాటిని పీక్కుని తిని ఉండ వచ్చని కూడా నిపుణులు తెలిపారు.ఇటీవల కనిపించకుండా పోయిన ఇద్దరు మహిళలు ఇదే ప్రాంతంలో శవాలై కనిపించగా, మజాట్లాన్‌లోని పసిఫిక్ రిసార్ట్ బీచ్‌లో కూడా రెండు శవాలను కనుగొన్నామని తెలిపారు.ఎవరో వారిని తలపై షూట్ చేసి చంపేశారన్నారు.అలాగే ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో ప్రముఖ వ్యాపారస్తులు,రాజకీయవేత్తలు నివసిస్తున్నారని, అయితే, హంతకులు ఈ ప్రాంతంలోనే శవాలను ఎందుకు పడేస్తున్నారు,అది కూడా సంపన్నులు నివసించే ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారు.ఈ హత్యలు చేస్తోంది ఎవరు? అనే విషయం అంతుచిక్కడం లేదు.ఇప్పుడు మెక్సికోలో ఇదో మిస్టరీగా మారిందని చెబుతున్నారు.. ..  

మరింత సమాచారం తెలుసుకోండి: