దేశంలో కొత్త వాహన చట్టం సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.  ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత అదే రోజు నుంచి చాలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చాయి.  కొత్త చట్టం ప్రకారం విధించే జరిమానాల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.  ఒకసారి ఒక బండిని చెక్ చేశారు అంటే.. నిబంధనల ప్రకారం అన్ని కరెక్ట్ గా ఉండాలి.  అలా ఉంటేనే..బండిని వదిలేసారు.  చాలామంది అధికలోడు వేసుకొని రోడ్డుపై ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ కు కారణం అవుతున్నారు. 


అందుకే చట్టాలను కఠినం చేసింది కేంద్రం.  జరిమానాల విషయంలో వెనకడుగు వెయ్యొద్దని ఆర్డర్స్ పాస్ చేసింది.  జరిమానాల విషయంలో రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.  దీంతో సామాన్యులు కొంత అసహనానికి గురైనా.. నిబంధనల ప్రకారం వెళ్తే.. ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి సక్రమంగా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.  కాగా, ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడే పోలీసులు ఆ రూల్స్ ను పాటించకపోతే.. వాళ్ళను ఎవరు ప్రశ్నించాలి.  ఇంకెవరు ప్రశ్నిస్తారు.. ప్రజలే.  


ఝార్ఖండ్ రాజధాని రాంచిలోని ఆల్బర్ట్ స్ట్రీట్ లో పోలీసు పెట్రోల్ వాహనం వెళ్తున్నది.  అందులో డ్రైవింగ్ చేస్తున్న పోలీసులు, ఆ పక్కన కూర్చున్న పోలీసు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని గుర్తించిన ప్రజలు ఆ వాహనాన్ని ఆపారు.  సీటు బెల్ట్ పెట్టుకోలేదని, చలానా కట్టాలని డిమాండ్ చేశారు.  ఒక్కసారిగా అక్కడికి ప్రజలు గుంపులుగా రావడంతో పరిస్థితి చేజారిపోయింది.  ఆ ముందే పోలీసులు బండ్లను చెక్ చేస్తున్నారు.  వారు అక్కడికి రావడంతో ప్రజలు చలానా వేయాలని డిమాండ్ చేశారు.  దీందో అక్కడ పెద్ద రగడ జరిగింది.  


ఇదిలా ఉంటె, అత్యధిక జరిమానాలు విధించే రాష్ట్రాల్లో ఒడిశా ముందు ఉన్నది.  నిబంధనలను ఉల్లంఘించి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్ అశోక్ కుమార్ అనే వ్యక్తికీ 86,500/- జరిమానా విధించింది.  ఇప్పటి వరకు విధించిన జరిమానాల్లో ఇదే రికార్డ్ అని చెప్పాలి. అయితే, సదరు డ్రైవర్ దాదాపు సుమారు ఐదు గంటలకు పైగా పోలీసులతో చర్చలు జరిపిన తరువాత ఆ జరిమానాను 70వేల రూపాయలకు తగ్గించారు.  ఉసూరుమంటూ 70వేలు చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఇలాంటి ఘటనలు దేశంలో తరచుగా జరుగుతుండటం విశేషం.   


మరింత సమాచారం తెలుసుకోండి: