తాజాగా ఈ రోజే కెసిఆర్ తన క్యాబినెట్ లోకి ఆరుగురు మంత్రులను నియమించారు ఆరుగురు మంత్రుల లో ముగ్గురు మంత్రులు కేటీఆర్ సబితారెడ్డి మరియు హరీష్ రావును కాగా మరొక ముగ్గురు కొత్త వాళ్లు ఆ కొత్త వాళ్లలో ఒకరి ఈ పువ్వాడ అజయ్ కుమార్. ఈ అజయ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు ఈయన ఎవరు అసలు ఈయనకి ఇటువంటి అవకాశం ఎలా వచ్చింది అని చాలామందిలో ఒక ప్రశ్న తలెత్తింది.

తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న అజయ్ అంతకుముందు ఖమ్మం జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. రవాణా శాఖ మంత్రిగా పదవి పొందిన అజయ్ కుమార్ ఖమ్మం కి చెందిన వారు కావడంతో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే కు మంత్రి పదవి దక్కింది.

ఒకప్పుడు అజయ్ కుమార్ తండ్రి సీపీఐ జాతీయ స్థాయి లీడర్స్ లో ఒకరు అక్కడి నుంచి మొదలైన అజయ్కుమార్ ప్రస్థానం ఇప్పుడు తెలంగాణ రవాణా శాఖ మంత్రి వరకు కొనసాగుతూ వచ్చింది. ఇంటర్ వరకు ఖమ్మంలోనే చదువు పూర్తిచేసిన అజయ్ కుమార్ ఆ తర్వాత ఎం ఎస్ సి గోల్డ్ మెడల్ హైదరాబాదులో చదువుకుంటుండగా సంపాదించారు.

తండ్రి రాజకీయ అనుభవం కలిసొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గారు అజయ్ కుమార్. ఆ తర్వాత కేసీఆర్ తో పరిచయం మెల్లమెల్లగా పెరుగుతుండడం ఈనాడు మంత్రి పదవి దక్కించుకునే స్థాయి వరకు అజయ్కుమార్ తీసుకువచ్చింది. ఏదేమైనప్పటికీ ఖమ్మం జిల్లా నుంచి మొదటిసారి మంత్రి పదవి దక్కినందుకు ఖమ్మం జిల్లా వాసులకు అభినందనలు తెలపడమే కాకుండా, మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్న అజయ్ కుమార్ కి కూడా అభినందనలు తెలిపి ఆల్ ది బెస్ట్ చెబుదాం.


మరింత సమాచారం తెలుసుకోండి: