మన ఇంట్లో పసి పిల్లలు ఉన్నారంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. వారికీ చిన్న దెబ్బ కూడా తగలకుండా ఉండేందుకు హాని కల్గించే వస్తువులు అన్ని పక్కకు తీసి పెడుతారు. వారు ఎంత ముద్దు ముద్దుగా అల్లరి చేసిన ఆ వస్తువులు చూసినప్పుడు కావాలి అని గోము చేసిన అవి ఇవ్వకుండా దూరం పెట్టి జాగ్రత్త పెడుతాం. కానీ కొన్ని కొన్నిసార్లు ఆలా తీసుకున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతుంటాయి.              


అలాంటి ప్రమాదమే అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో జరిగింది. పద్దెనిమిది నెలల పసివాడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ ముద్దు ముద్దుగా నవ్వుతున్న పసివాడును చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఆలా మురిసిపోవడం దేవుడికి నచ్చనట్టుంది. అందుకే ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపేసాడు ఆ దేవుడు.                       


ఇంకా విషయానికి వస్తే అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో వేడి పాల గిన్నెలో పడి ఓ చిన్నారి మృతిచెందాడు. గ్రామంలోని సుంకులమ్మ కాలనిలో నివాసముంటున్న లోకేశ్వరయ్య, చంద్రిక దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దేవాన్ష్. అయితే ఆదివారం శుభకార్యం ఉందని పెరుగు అవసరమైతుందని శనివారం రాత్రి పాలను వేడి చేసి చల్లారేందుకు ఫ్యాన్ కింద ఉంచారు.                    


ఈ నేపథ్యంలోనే దేవాన్ష్ ఆడుకుంటూ వెళ్లి వేడి పాల గిన్నెలో పడిపోయాడు. వెన్తనె అప్రమత్తమైన కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడినందుకు మెరుగైన వైద్యం కోసం కర్నూల్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆ పసివాడు మృతి చెందాడు. దీంతో ఆ పసివాడి ఇంట విషం నెలకొంది.                               


మరింత సమాచారం తెలుసుకోండి: