ఇది ఏడాది గత నెలలో ముంబైలో కురిసిన కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వారాల పాటు వర్షం ఆగకుండా పడటంతో ఎక్కడికక్కడ రోడ్లు నిండిపోయి ఉద్యోగాలకు స్కూళ్లకు సెలవులు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రాబోతుంది అన్న వార్త విని ముంబై ప్రజలలో భయం నెలకొంది.

ఈ పరిస్థితి ముంబై లోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని వివిధ చోట్ల వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతన్నలకు వర్షమే వరం కానీ అదే వర్షం కుండపోతగా కురుస్తున్న ఉంటే జన జీవనానికి ఆటంకం కలుగుతుంది. వర్షాకాలం వచ్చే ముందే నగరంలో మునిసిపాలిటీ వారు అన్ని చర్యలు చేపట్టి నీరు ఎక్కడికక్కడ ఉండిపోకుండా నిలువ నీళ్లు డ్రైనేజీ గుండా వెళ్లే ఏర్పాట్లను సరిచేసుకోవాలి.

ప్రతి ఏడాది వర్షాలు పడటం నీళ్ళు నిల్వ ఉండిపోవడం డ్రైనేజీ మొదలు తెరచుకుని ఉండటం అందులో ఎవరో ఒకరు ప్రాణాలు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఎటువంటి ముందు చర్యలు చేపట్టలేదని అందుకే ఇటువంటి సంఘటనలు జరిగాయని ప్రజలు వాపోతున్నారు కూడా గవర్నమెంట్ మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చూసుకోడానికి చర్యలు చేపట్టలేదు.

ఈ వర్షాలు ఇక్కడితో ఆగవని ఇంకా కొన్ని రోజులు ఇలాగే కుండపోత వర్షం పడుతుందని వాతావరణ సూచనలు వస్తుండటంతో, ముంబై వాసులు దిక్కుతోచక కంగారు పడుతున్నారట. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు హామీ అందించింది.

ఈ పరిస్థితి హైదరాబాద్ లో తాజాగా చోటుచేసుకుంది వర్షాకాలంలో వర్షాలు కాకుండా ఏడాది పొడవునా ఇటువంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కావున ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: