గత కొంత కాలంగా ఏపీ పోలీసులు గంజాయి స్మగ్లర్ లతో చాలా విసుగు చెందుతున్నారు.  దీనితో గంజాయి స్మగ్లర్ ల పని పట్టేందుకు విశాఖ జిల్లా పోలీసులు కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు నార్కొటిక్స్ లో శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో స్మగ్లర్స్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసుల జాగిలాలు మత్తు పదార్థాల గుట్టును రట్టు చేస్తున్నాయి.


దేశంలో ఎక్కడా గంజాయి పట్టుబడ్డ దాని మూలాలు విశాఖ మన్యంలోని బయటపడటం కలవరం రేపుతోంది. ఇక్కడి అడవుల్లో పండే గంజాయికి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతమైన గిరాకీ ఉండడంతో స్మగ్లర్ లు అక్రమ రవాణా చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో భారీగా ఆదాయం వస్తుండటంతో స్మగ్లర్ లు మరింత దూకుడు పెంచారు.

పర్యాటకులు, ప్రయాణికులు, విద్యార్థుల రూపంలో ఈ  'మత్తు' పంటను అక్రమ రవాణా చేస్తున్నారు. పోలీసు ఎక్సైజ్ శాఖలు ఎన్ని విధాలుగా నిఘా పెట్టినా స్మగ్లర్ ల దూకుడు మాత్రం అరికట్టలేకపోతున్నారు. కూరగాయల మొక్కలు నిత్యావసరాల మాటున టన్నుల కొద్దీ గంజాయి సరిహద్దులు దాటిపోతున్నది. నిఘా అధికమైన ప్రతిసారి తనిఖీలకు చిక్కకుండా స్మగ్లర్ లు కొత్త దారులు వెతుకుతున్నారు. గతంలో మాదిరి గా బస్తాల్లో కాకుండా రెండేసి కిలోల చొప్పున ప్యాకెట్ లు కట్టి, వాటికి పేపర్ లో చుట్టి ప్లాస్టర్ తో పటిష్టంగా ప్యాకింగ్ చేస్తున్నారు.

లారీలు మరియు వ్యాన్ లు అడుగు భాగాన క్యాబిన్ లో వెనుక పైన ఉంచి తరలిస్తున్నారు. పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహించిన ఈ ప్రత్యేక ఏర్పాట్లతో  కాస్త కనిపించట్లేదు. ఇక ప్రయాణీకుల రూపంలో బస్సులు, కార్లు, జీపుల్లో సూట్ కేసులో మరియు బ్యాగుల్లో గంజాయిని రవాణా చేస్తూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

స్మగ్లర్ లు ఇలా కొత్త తరహాలో స్మగ్లింగ్ చేయడంతో పోలీసులకు వాటిని పట్టుకోవడం అన్ని సందర్భాల్లో సాధ్యం కావటం లేదు. అందుకే ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దించుతున్నారు. మత్తు పదార్ధాలు ఎక్కడున్నా వాటిని పసిగట్టేలా ఈ ప్రత్యేక జాగిలాలకు శిక్షణ ఇచ్చారు. ఇవి మత్తుపదార్థాన్ని ఈజీగా పట్టుకొంటున్నాయి.

తాజాగా పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సును తనిఖీ చేయగా మూడు బ్యాగుల్లో సుమారు ముప్పై నాలుగు కేజీల గంజాయిని పసిగట్టాయి. దీంతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ మహిళ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఈరోజు పాడేరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు మరియు వాహనాలను తనిఖీ చేయగా మూడు బ్యాక్స్ లలో గంజాయి తో ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ దొరికారు. మొత్తం మీద ఈ జాగిలాలు ఇలా పాడేరు ప్రాంతం నుంచి పలు వాహనాల్లో గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్ ల ఆటకటిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: