మున్సిపల్ శాఖ మంత్రి గా బాధ్యత లు తీసుకున్న వెంటనే హైదరాబాద్ పై ఫోకస్ పెట్టీన  కేటీఆర్ జంట నగరాల్లో విషజ్వరాలపై సమీక్ష నిర్వహించారు. జీహెచ్ ఎంసీ కార్యాలయం లో శానిటేషన్ ఆసుపత్రుల్లో పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు జ్వరాల నియంత్రణ దోమల నివారణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఈటెల కూడా పాల్గొన్నారు. 


 ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులపైనా సమీక్ష సమావేశం నిర్వహించే క్రమంలో ఆయన జీహెచ్ఎంసీ అధికారు లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి నూట యాభై డివిజన్లలో సమావేశమయ్యారు  ఎటువంటి పరిస్థితులున్నాయి అని తెలుసుకున్నారు, అంతేకాదు ఈ సమావేశాని కి ప్రధానం గా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు.  వైరల్ ఫీవర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఇప్పటి వరకు నమోదైన కేసులు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి వీటన్నింటికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క అధికారితో ఆయన  సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. 


గత వారం పది రోజులు గా చూసిన హైదరాబాదు లో ఏ ఇంటికెళ్లినా ఒక్కరైనా  అనారోగ్యం పాలై ఆసుపత్రి వెళ్లాల్సిన దుస్థితి కనిపిస్తుంది.  అంతేకాదు ఆసుపత్రుల్లో కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లు దాంతో జనం చాలా  ఇబ్బందులు పడుతున్నారు.  వీటి అన్నింటికీ పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలనుకుని అందులో భాగంగానే జిహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో పాటు హెల్త్ ఆఫీసర్స్ కూడా ఈ సమావేశాని కి హాజరయ్యారు.  దోమల నివారణ కోసం హైదరాబాద్ ను క్లీన్ చేయడం తో పాటు  ఆసుపత్రుల్లో ఏ విధంగా వైద్య సేవలందిస్తున్నారు అనే దాని పైన పూర్తిగా సమీక్ష చేసినట్టు సమాచారం.


 ప్రధానం గా హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో సానిటేషన్ అనేది సరిగా లేదు, దోమల నియంత్రణ అనేది సరిగా జరగట్లేదు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, హైదరాబాద్ లో వాస్తవం కూడా అలాగే ఉంది. అందుకోసం ముందు గా హైదరాబాద్ ను క్లీన్ చేయండి అనే ఒక స్లోగన్ ఇచ్చారు అది ముందుగా మంత్రుల  నివాసాల నుండి   మొదలుపెట్టి, ఐఏఎస్ అధికారులు, మేయర్ బొంతు రామ్మోహన్ మిగితా  కార్పొరేటర్లు  వాళ్ళందరి ఇల్లు కూడా ముందుగా శుభ్రం చేసుకోవాలి, వాళ్లంతట వాళ్లు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా దాన్ని అప్ డేట్ చేయాలి. ఆ విధంగానే  హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు అందరూ ఈ క్లీనింగ్ విషయం లో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లను క్లీన్ చేయాలి,  దోమలు ఆవాసాలుగా ఉండలేని  పరిస్థితి ని ఏర్పాటు చేయాలి అని కేటీఆర్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: