భారత్ పై ఉగ్ర కుట్ర కు పాల్పడేందుకు పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తోంది కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్  ను భారీ దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది ఆర్టికల్ రద్దు అనంతరం పాక్ భారత చేసింది తప్పు గా చూపించాలని చాలా ప్రయత్నాలే చేసింది. అంతేకాదు ఇండియాకు వ్యతిరేకం గా ప్రపంచ దేశాల మద్దతు ను కోరింది. కానీ అమెరికా రష్యా వంటి దేశాలు భారత్ కు మద్దతు ఇవ్వడం తో పాక్ కుట్రలు  విఫలమయ్యాయి. అనంతరం ఐరాస వేదిక గా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది పాక్ అక్కడ కూడా పాక్ ప్రయత్నా లు విఫలమయ్యాయి కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమ ని ఆ అంశం ఇతరుల జోక్యం అనవసరం అని ఐరాస తేల్చి చెప్పింది. 


వీటన్నిటితో ఇంకా ఆగ్రహాన్ని పెంచుకున్నాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నేపథ్యం లో జైషే మహ్మద్ అధినేత ను అరెస్టు చేసినట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన పాకిస్తాన్ వెంటనే యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నట్టు నటిస్తూనే కొత్త ఎత్తుగడ కు తెరతీసింది. 

ఉగ్రవాదం విషయం లో మరోసారి తన వక్రబుద్ధి ని చూపింది జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ ను పాక్ రహస్యం గా విడుదల చేసినట్టు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కి సమాచారం అందింది. దీంతో ఐబీ వర్గా లు ప్రభుత్వానికి అప్రమత్తం చేశాయి. భారత్ పై ప్రతీకార చర్యల కు ఎప్పట్నుంచో కాలు దువ్వుతున్న పాక్ అజార్ ను విడుదల చేసి ఈ చర్యకు పాల్పడేందుకు వ్యూహా లు రచించినట్టు ఐబి అనుమానం వ్యక్తం చేస్తోంది.

 పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఓ అడుగు ముందుకేసి కశ్మీర్ కు తాము అండగా ఉంటామని అవసరమైతే భారత్ తో యుద్ధాని కి కూడా సిద్ధంగా ఉంచామని గెంతులేశారు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని కూడా వ్యాఖ్యా నించారు. ఈనేపధ్యం లో అంతర్జాతీయ ఉగ్రవాది గా పేరొందిన అజార్ ను భారత్ పై యుద్ధాని కి ఉసిగొల్పేందుకు జైలు నుంచి విడుదల చేసినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.  భారత నిఘా వర్గాల సమాచారం అందుకున్న ఆర్మీ రక్షణ సిబ్బంది సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచింది. బలగాల ను అప్రమత్తం చేసింది , ఉగ్రవాద సంస్థ లకు దిశానిర్ధేశం చెయ్యటానికే ఇతడిని వదిలిపెట్టినట్టు ఐబీ తెలిపింది. దేశ ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని అర్మీ అధికాతి సైనీ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: