రాష్ట్రంలో వేధింపులకు గురైన మహిళలకు ప్రభుత్వం ఆయా సంఘటనలను బట్టి పరిహారం ప్రకటిస్తుంటుంది. కొన్ని దారుణాలు మీడియాలో వెలుగు చూడగానే మంత్రులు, అధికారులు అక్కడ ప్రత్యక్షమై వారిని ఆదుకునేందుకు పరిహారం ప్రకటిస్తారు. అవన్నీపేపర్లలో ఘనంగా వస్తాయి. కానీ బాధితులకు మాత్రం సహాయం అందదు. దాని కోసం వారు మళ్లీ ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగాలి.


ఇలా మొత్తం 1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం 7.48 కోట్ల రూపాయలను గత చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచేసింది. ఈ విషయం మహిళ,శిశు సంక్షేమ శాఖ సమీక్షలో జగన్ దృష్టికి వచ్చింది. జగన్ వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని ఆ అభాగినులకు తక్షణమే పరిహారం సొమ్ము అందించాలని ఆదేశించారు. అంతే కాదు.. ఇలాంటి ఘటనల్లో బాధితులకు సహాయం చేయడానికి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.


అలాగే.. బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించాలన్న సీఎం, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపైనా జగన్ చర్చించారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తనకు తెలియజేయాలన్న సీఎం జగన్...భూ వివాదాలు, ఇతరత్రా వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలన్నారు. వీటిని దశాబ్దాల తరబడి నాన్చి న్యాయం జరగని పరిస్థితి ఉండకూడదన్నారు.


సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదని స్పష్టంచేశారు. అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు ఏవైనా లబ్ధిదారుడికి కాదని చెప్పడానికి కాదన్నారు. బయోమెట్రిక్‌ లేదా ఐరిస్‌ లేదా వీడియో స్క్రీనింగ్‌ ఇవన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరిందనే దానికి ఆధారం తప్ప, ఏ స్కీంనైనా నిరాకరించడానికి కాదని సీఎం స్పష్టంచేశారు. పాలనలో మానవీయత ఉంటే.. ఇలాంటి నిర్ణయాలే వెలువడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: