ఇండియా పాక్ ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి.  అటునుంచి ఇటు ఎవరూ రావడం లేదు.  ఇటు నుంచి అటు ఎవరూ వెళ్లడం లేదు.  కనీసం ఇండియా ఫ్లైట్స్ పాక్ గగనతలం ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు.  ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విదేశాలకు వెళ్ళడానికి పాక్ గగనతలం ఉపయోగించుకోవడానికి అనుమతి కోరితే దానికి ససేమిరా అన్నది పాకిస్తాన్.  


అయితే, ఇండియా కొన్ని విషయాల్లో పాక్ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందిస్తోంది. అందులో ఒకటి మెడిసిన్స్.  మనదేశం నుంచి నిత్యం కొన్ని కోట్ల రూపాయాలమేర మెడిసిన్స్ పాక్ కు సప్లై అవుతుంటాయి.  వాణిజ్య ఒప్పందాన్ని పాక్ రద్దు చేసుకున్న తరువాత, మెడిసిన్స్ సప్లై ఆగిపోయింది.  దీంతో పాక్ లో మెడిసిన్స్ దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.  పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.  


దీంతో పాక్ దిగొచ్చి మెడిసిన్స్ సప్లై చేయాలని కోరింది.  దీనికి ఇండియా సానుకూలంగా స్పందించి మెడిసిన్స్ సప్లై చేస్తున్నది.  ఇదిలా ఉంటె, సరిహద్దుల్లో మాత్రం పాక్ నిత్యం ఏదోవిధంగా రగడ చేస్తూనే ఉన్నది.  కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతూనే ఉన్నది.  ఇందులో భాగంగానే పాకిస్తాన్ కుప్వారా సరిహద్దుల్లో కొంతమంది తీవ్రవాదులను ఇండియాలోకి చొరబాటు చేసేందుకు సిద్ధం అయ్యింది.  


పాక్ కమెండోల సహాయంతో ఇలా చొరబాట్లు చేసేందుకు పాక్ రెడీ అయ్యింది.  కానీ, పాక్ కుతంత్రాన్ని ఇండియా నిత్యం తిప్పుకోడుతూనే ఉన్నది.  పహారా విషయంలో ఇండియా చాలా స్ట్రిక్ట్ గావ్యవహరిస్తోంది. ఉదాసీనతను ప్రదర్శించకుండా..ఎదురుదాడి చేస్తున్నది.  పాక్ చొరబాటు దారులను సమర్ధవంతంగా తిప్పికొడుతూ.. జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురైదుగురు తీవ్రవాదులు ఉన్నట్టు సమాచారం.  పాక్ నుంచి ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోను ఇండియా సైన్యం రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: