ఏపీలో ఇప్పుడు బువ్వ పోరాటం బాగా రంజుగా సాగుతుంది. ఇక్క‌డ పేద‌ల బువ్వ‌ను రాజ‌కీయం చేస్తూ క‌డుపు నింపుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ ఆలోచ‌న చేస్తుంటే.. పేదలకు ప‌ట్టేడ‌న్నం పెట్టి వారి క‌డుపు నింపితే అది ప‌దివేల‌నుకుంటుంది అధికార‌పార్టీ. అయితే అధికార పార్టీ చేప‌ట్టిన రేష‌న్ బియ్యం పంపిణి ప‌థ‌కంలో లోపాల‌ను వెతుకుతూ పేద‌ల నోటికాడ బువ్వ‌ను లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తుంది ప్ర‌తిప‌క్ష ప‌చ్చ‌పార్టీ.. ఇప్పుడు పేద‌ల క‌డుపు నింపే ఈ ప‌థ‌కం రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువు అవుతుంటే.. అధికార పార్టీ పంపిణి చేస్తున్న బియ్యంతో క‌డుపు నిండుతుంది ఇది మాకు ప‌దివేలంటుంది.. పేద జ‌నం..
ఏపీలో గ‌తంలో కొలువుదీరిన ప‌చ్చ‌పార్టీ జాతీయ ప్ర‌జాపంపిణి వ్య‌వ‌స్థ ద్వారా బియ్యం, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అందించింది. అయితే అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ముక్కిపోయిన, పురుగుప‌ట్టిన, ల‌క్క‌పురుగులు ఉన్న బియ్యం పంపిణి చేసి చేతులు దులుపుకుంద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఉంది.

ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది.. ప్ర‌జాపంపిణి వ్య‌వ‌స్థ మారింది. అందుకు నిద‌ర్శ‌నం శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన  ఓ కుర్రాడు త‌ను తినే తిండిని ఫోటోలు తీసి త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి మీరు ఇచ్చిన రేష‌న్ బియ్యంతో రైస్ వండితే చ‌క్క‌గా అయ్యింది. థాంక్యూ జ‌గ‌న్ గారు, థాంక్యూ ఏపీ సీఎం పేద‌ల క‌డుపు నింపిన అన్న‌దాత చ‌ల్ల‌గా ఉండాలి అంటూ దండం పెట్టిన ఫోటో, ఫోటో రైట‌ప్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిందేమంటే.. ప్ర‌తిప‌క్ష పార్టీ ఇస్తున్న రేష‌న్ బియ్యం బాగాలేవ‌ని జ‌నం చానా ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అధికార పార్టీ మాత్రం ప్ర‌జ‌లు తిన‌గ‌లిగేలా ఉండే రేష‌న్ బియ్యంను పంపిణి చేస్తామ‌ని, అది కూడా ఇంటింటికి తిరిగి పంపిణి చేస్తామ‌ని చెపుతుంది. అయితే తిన‌డానికి రుచి మ‌రిగిన ప‌చ్చ‌పార్టీ నేత‌లు రేష‌న్ బియ్యం పంపిణి ప‌థకాన్ని విమ‌ర్శిస్తుంటే.. ప్ర‌జ‌లు మాత్రం అందుకు విరుద్ధంగా రైస్ చ‌క్క‌గా అవుతుంది.. తిన‌డానికి బాగుంద‌ని అంటున్నారు.


అంటే ప్ర‌జ‌ల ప‌క్షం వ‌హించాల్సిన ప్ర‌తిప‌క్షం కేవ‌లం రాజ‌కీయ క‌క్ష‌తోనే.. మేము చేయ‌లేక పోయాము.. ఇప్పటి పార్టీ కూడా చేయోద్దు.. పేద ప్ర‌జ‌ల‌కు మంచి బియ్యం ఇయ్యెద్దు అని అరిచి గీపెట్ట‌డం పేద‌ల నోటికాడి బుక్క లాకున్న‌ట్లే అవుతుంది. అందుకే ప‌చ్చ‌పార్టీ నేత‌లు ఇక‌నైనా క‌ళ్ళు తెరిచి వాస్త‌వ ప్ర‌పంచంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై.. వారికి ఏమి కావాలో వారిని అడిగి వాటికై పోరాటం చేయాలి.. అంతేకాని జ‌నం మెచ్చుకుంటున్న ప‌థ‌కాన్ని మీరు విమ‌ర్శిస్తే.. ఇప్పుడు ప‌ట్టిన గ‌తే మీకు మ‌రోమారు ప‌ట్ట‌క త‌ప్ప‌దు..


మరింత సమాచారం తెలుసుకోండి: