ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడానికి, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల జీవన శైలి మారడానికి ఒకే ఒక్క కారణం ఈరోజు. సరిగ్గా 1980 సెప్టెంబర్ 10న అంటే ఈరోజు ఒకరి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఎవరిదో కాదు.. స్వర్గీయ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సుపుత్రికతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పెళ్లి జరిగిన రోజు ఇది. 


సరిగ్గా ఈరోజుకి పెళ్లి జరిగి 39 సంవత్సరాలు పూర్తయ్యింది. చంద్రబాబు అని చెప్పగానే వెన్నుపోటు రాజకీయ నాయకుడు అని గుర్తుచ్చేస్తుంది. చంద్రబాబుకు 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది. కానీ ఆ 40 ఏళ్ళ చరిత్రలో 39 ఏళ్ళ చరిత్ర భువనేశ్వరితో పెళ్లి జరిగాకనే మొదలయింది. అడ్డు వచ్చిన వాళ్ళని అడ్డులేకుండా చేసుకుంటూ అంచలంచలుగా రాజకీయాల్లో ఎదిగాడు చంద్రబాబు. 


ఆలా ఎదుగుతున్న సమయంలో చివరికి పిల్లనిచ్చిన మామని కూడా అడ్డు తప్పించి ముఖ్యమంత్రి అయ్యాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు పెళ్లిరోజు కావడంతో అయన సుపుత్రుడు నారా లోకేష్ పెళ్లి రోజు శుభాకాంక్షలు ట్విట్టర్ వేధికగా తెలిపాడు. దీంతో చంద్రబాబు పెళ్లి రోజు టాపిక్ ఈరోజు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అన్ని వెబ్ సైట్స్ లో, న్యూస్ ఛానల్స్ లో ఈ పెళ్లి రోజు హాట్ టాపిక్ మారింది. 


దీంతో కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ''చంద్రబాబు నాయుడు ఒక్కడు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారి అయ్యింటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికి సింగపూర్ అయ్యేది' అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్లు చూశాక అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు బ్రహ్మచారి అయ్యింటే ఎంత బాగుండో అని.                     


మరింత సమాచారం తెలుసుకోండి: