పధ్ధెనిమిది నెలలుగా దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉందని ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై చింతిస్తున్నానన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం కారణంగా స్థూల దేశీయోత్పత్తి తగ్గిందన్న కేసీఆర్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే బడ్జెట్ ను రూపొందించామన్నారు. తెలంగాణ అభివృద్ధి బాటలోనే సాగుతున్నప్పటికీ వృద్ధి మందగించిందన్నారు. బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ ఆర్థిక మాంద్యం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాలం నుంచి దేశం ఆర్థిక మాంద్యానికి గురవుతూ వస్తుందన్నారు. రెండు వేల పధ్ధెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ దేశ జిడిపి ఎనిమిది శాతంగా నమోదైంది అన్న కేసీఆర్ అప్పటి నుంచి క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది అన్నారు.


జూన్ జూలైలో తెలంగాణ రాష్ట్రం తీసుకున్న జీఎస్టీ పరిహారం కంటే ఏప్రిల్ మే నెల కంటే నాలుగు రెట్లు తక్కువగా ఉందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. మాంద్యం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకువెళ్తోందన్నారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఐదేళ్లలో ఆదాయం రెట్టింపైందన్న ఆయన ఆర్ధికంగా దృఢంగా మారిందన్నారు. అయితే మాంద్యం కారణంగా వృద్ధి మందగించిందన్నారు, రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఒక లక్షా ఎనభై రెండు వేల పదిహెడు కోట్ల రూపాయలను ప్రతిపాదిత వ్యయంగా ఓటాన్ ఎకౌంట్ లో ప్రభుత్వం అంచనా వేసినా మారిన పరిస్థితుల్లో ఒక లక్షా నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లకు కుదించారు. రాష్ట్ర రెవిన్యూ వ్యయం లక్షా పదకొండు వేల కోట్ల రూపాయలుంటే మూలధన వ్యయం పదిహేడు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్లుగా అంచనా వేశారు. మిగులు ఆదాయం రెండు వేల నలభై నాలుగు కోట్లుగా ఉంటే రాష్ట్ర ఆర్ధిక లోటు ఇరవై నాలుగు వేల ఎనభై ఒక్క కోట్లుంటుందని అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి కాముక విధానాల వల్ల అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు నమోదైంది అన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు ఉంటే గడచిన ఐదేళ్లలో ఆరు పాయింట్ మూడు శాతం అదనపు వృద్ధి సాధించామన్నారు.



రైతుబంధు పథకం కింద రైతులకు ఇస్తున్న ఎనిమిది వేల రూపాయల సాయాన్ని పది వేలకు పెంచామన్నారు. ఇందు కోసం బడ్జెట్ లో పన్నెండు వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. రైతు బీమా పథకానికి ఒక వెయ్యి నూట ముప్పై ఏడు కోట్లు కేటాయించారు. రైతు రుణమాఫీ కోసం ఆరు వేల కోట్లు విద్యుత్ సబ్సిడీలకు ఎనిమిది వేల కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి నమోదైందన్నారు సీఎం కేసీఆర్. ఇక ఐటి సేవల రంగంలో పదకొండు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు నమోదైంది అన్నారు. రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఐటీ ఎగుమతులు యాభై రెండు వేల కోట్లు ఉంటే రెండు వేల పధ్ధెనిమిది పంతొమ్మిది నాటికి లక్షా పది వేల కోట్లకు పెరిగాయన్నారు. మునిసిపాలిటి పంచాయతీ రాజ్ లకు నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకొంటామని ప్రకటించారు ముఖ్యమంత్రి. గ్రామ పంచాయతీలకు రెండు వేల ఏడు వందల పద్నాలుగు కోట్లు మున్సిపాలిటీలకూ పదిహేడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.


ఆసరా పెన్షన్ లకు బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్లు కేటాయించారు. ఇక వృద్ధాప్య పెన్షన్ కు అర్హత వయసును అరవై ఐదు నుంచి యాభై ఏడుకు తగ్గించామన్నారు సీఎం కేసీఆర్. బడ్జెట్ లో సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్న ముఖ్యమంత్రి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్టులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు మేలు చేసే కేంద్ర పథకాలన్నీ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ చాలా బాగుందన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇరవై ఆరు లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే, ఆరోగ్య శ్రీ ద్వారా ఎనభై ఐదు పాయింట్ మూడు నాలుగు లక్షల కుటుంబాలకు ప్రయోజనం దక్కుతుంది అన్నారు కేసీఆర్.


బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు. మొత్తంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు తాజా బడ్జెట్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు కేసీఆర్. స్వీయ ఆదాయం తగ్గడంతో పాటు నిధుల బదలాయింపులో కేంద్రం కోత విధించటం ఆర్ధిక మాంద్యం వల్ల క్లిష్టమైన పరిస్థితి నెలకొందన్నారు. అయితే కర్ణాటక, పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్లా అని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: