భారత దేశంలోని చాలా ప్రాంతల్లోని ప్రజలు వైద్య సేవలు లేక అవస్థలు పడుతున్నరు. ఆ సమస్య ను తీర్చడానికి  ఏర్పాటు చేసిన ప్రభుత్వ హస్పిటల్స్ పని తీరు అంతంత మాత్రంగానే ఉంది. దానికి కారణం డాక్టర్లు అన్ని వేళల అందుబాటులో ఉండకపోవడం, విడిగా ప్రైవేటు క్లీనిక్స్ ఏర్పాటు చేసుకోవడం . ప్రైవేటు క్లీనిక్స్ నడుపుతున్న ప్రభుత్వ వైద్యుల ఆగడాలకు కర్ణాటక ప్రభుత్వం చెక్ పెట్టనుంది.
 
 సిఎం యడ్యూరప్ప నివాసం కృష్ణ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ...చాలా మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు క్లీనిక్స్ నడుపుతు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రద్ద చేస్తున్నారుని మరియు సరైన టైంకు రావడం లేదని చాలా మంది వైద్యుల పైన ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వైద్యుల పై వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. 


ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయడం వలన  చాలా రకాల నష్టలు ఉన్నాయి. ప్రభుత్వం వైద్య సేవల కోసం ఖర్చు పెడుతున్న కోట్లది రూపాయలు సకాలంలో పేదలకు అందడం లేదని. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేక చాలా మంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నరని. ప్రైవేటు హస్పిటల్ కి వెళ్ళే స్థోమత లేక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల పేద ప్రజలు మరింత అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.
ఇప్పటి నుండి ప్రభుత్వ ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు జరుపుతాం అవసరమైతే నిద్ర పోతాం.  ఉచిత వైద్య సేవలు  మరియు మౌళిక వసతులు ప్రజలకు అందిచడం పై తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలు సవ్యంగా సాగుతున్నాయని. కర్ణాటక ప్రభుత్వానికి నిధుల కోరత లేదని ఆయన స్పష్టం చేశారు. కుమార స్వామి కి  యడ్యూరప్ప ప్రభుత్వన్ని నిందించడం తప్పా వేరే పని లేదని ఆయన అన్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: