వినాయకుడు హాయ్ చెప్తాడు, కోరితే వరాలు కూడా ఇస్తాడు, అందుకే ఆ బొజ్జ గణపయ్య ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. హైదరాబాద్ లో కొలువైన రోబో గణేశుడి గురించి మీరు కూడా తెలుసుకోండి. వెరైటీగా ఉండే గణేశుడి విగ్రహాలు ఎప్పుడూ ప్రత్యేకమే, ఇంకాస్త క్రియేటివ్ గా ఉంటే మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. అందరి చూపును తమ వైపుకు తిప్పుకుంటాయి. ఎన్ని విగ్రహాలు ప్రతిష్టించినా కొన్ని మాత్రం ఎప్పుడూ హైలైట్ అవుతూ వుంటాయి. అలా ప్రత్యేకంగా నిలిచేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. తమ గణపయ్య వెరైటీగా ఉండాలని ఆరాటపడుతూ వుంటారు. హైదరాబాద్ వైభవ్ రోబోటిక్ స్కూల్ విద్యార్థులు కూడా సరికొత్తగా ఆలోచించారు.



రోబో గణనాథుడిని తయారు చేశారు. మియాపూర్ లో కొలువైన ఈ రోబో వినాయకుడు అందరి చూపును లాగేస్తున్నాడు. ఈ వినాయకుడిని తయారు చేసేందుకు పది మంది విద్యార్థులు వారం పాటు శ్రమించారు. వైభవ్ రోబోటిక్ నిర్వహకురాలు శైలజా దేవరకొండ ఆధ్వర్యంలో రోబో గణపయ్యను రూపొందించారు. వినూత్నమైన ఆవిష్కరణలు చేస్తున్న నిర్వాహకులు చిన్నారులను ఆకట్టుకునేలా గత రెండేళ్ల క్రితమే కార్టూన్ గణేష్ ను బ్లూటూత్ బేస్డ్ విధానంలో తయారు చేశారు. ఆ రోబో నడిచేందుకు ప్రత్యేకంగా సెన్సార్ లను కూడా రూపొందించారు. ఈ సారి మరింత కలరింగ్ ఇచ్చి మూడు అడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పుతో ఈ రోబో గణేశుడిని తీర్చిదిద్దారు.



ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ విధానంలో విగ్రహాన్ని తయారు చేశారు. వినాయకుని ఆకారం వచ్చేలా స్పాంజ్ బెలూన్స్ ను వాడారు. చేతిలో అయ్యారు సెన్సార్ పెట్టి లడ్డూను ఎవరైనా తీస్తే వెంటనే బజర్ ప్రెస్ అయ్యి సౌండ్ వస్తుంది. అంతేకాదు వినాయకుని తల ఆటోమెటిగ్గా తిరుగుతూ వుంటుంది. అల్ట్రా సెన్సార్ పొందుపరిచినందున ఎదురుగా ఎవరైనా నిల్చుంటే వారికి తొండం ద్వారా ప్రసాదం ఇచ్చేలా రూపొందించారు. దీని తయారీకి పది వేల రూపాయలు ఖర్చయ్యింది. చిన్నారులు ఈ రోబో వినాయకుడిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. టెక్నాలజీ ద్వారా గణనాథున్ని విశిష్ట తెలియజేసేందుకే నిర్వాహకులు ఈ కాన్సెప్ట్ ను వినియోగించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: