సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన కొత్త చలాన్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ చలాన్లను చూసి బాబోయ్ గుండె ఆగిపోయేట్టు ఉంది అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కానీ ఆ కామెంట్ నిజమైంది. తాజాగా కొత్త చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగి గుండెపోటుతో మృతి చెందాడు ఓ యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.         


ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 8న ఆదివారం సాయింత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వస్తే .. నొయిడాకు చెందిన 35 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన తల్లితండ్రులతో కలిసి ఆదివారం సాయంత్రం కారులో వెళ్తున్నాడు. ఘుజియాబాద్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు కారును ఆపారు. కొత్త వాహనం చట్టం ప్రకారం కాగితాలు తనిఖీ చెయ్యాలని డ్రైవింగ్ సీటులో కూర్చున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కారుపై లాఠీతో కొడుతూ అడిగారు.     


లాఠీలతో కారుపై కొట్టడం నచ్చని ఆ యువకుడు పోలీసులకు ఎదురు తిరిగాడు. దీంతో వారి మధ్య పెద్ద వాగ్వాదామె జరిగింది. ఈ సమయంలో ఆ యువకుడు భారీగా తెల్సిన్ పడ్డాడు. దీంతో అక్కడే కుప్పకూలి పడిపోయాడు. అయితే ఈ విషయాన్నీ గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. 


అయితే కొడుకు మృతితో కూలిపోయిన కుటుంబసభ్యులు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల దురుసు ప్రవర్తన వల్లే కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంగించకపోయినా పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా ఈ ట్రాఫిక్ కొత్త చట్టంపై ప్రజలు ఇప్పటికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: