దేవుడున్నాడా అనే ప్రశ్నకి ఇదిగో ఇలాంటి కొన్ని అద్భుతాలు జరిగినపుడు దేవుడు ఉన్నాడని మానవాళికి అనిపిస్తూంటుంది. కేరళలో జరిగిన ఒక ఘటన ప్రజలను చలింపజేసింది. అర్దరాత్రి వేగంగా వెళుతున్న జీపు నుంచి ఒక పసికందు జారి కింద పడిపోయింది. జీపులో వెళ్తున్నవారెవ్వరూ ఈ విషయాన్ని గమనించలేదు.  ఆ చిన్నారి కింద పడి పోయిన తరువాత పాకుతూ అటూ ఇటూ తిరిగిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సామజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి.


ఈ దృశ్యాలన్నీ దగ్గరలో ఉన్న సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. మున్నార్ అడవు గుండా పోయే రోడ్ లో పడి పోయిన ఈ చిన్నారిని ఫారెస్ట్ అధికారులు చూసి వెంటనే రక్షించారు. మున్నార్ దగరలో ఉన్న అన్ని చెక్ పోస్టులను వెంటనే అలర్ట్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించారు. అటుపిమ్మట చిన్నారిని దగ్గరలోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

చిన్నారికి పెద్ద గా గాయాలేమీ కాలేదని, తలపై రోడ్డు రాసుకు పోయిన గాయాలు తప్ప అంతర్గతంగా ఏమి కాలేదు అని మున్నార్ ఎస్ఐ అన్నారు. మున్నార్ అడవులలో రోడ్డుపై వేగంగా వెళుతున్న కారు జీప్ నుంచి కింద పడి పోయిన చిన్నారి ఆశ్చర్యంగా ప్రాణాలతో బయటపడింది అని చెప్పారు.

చిన్నారి కింద పడి పోయిన సమయంలో జీపులో అందరూ నిద్రపోతున్నట్లు తెలుస్తోంది అని తెలిపారు. గాఢంగా నిద్రుస్తున్న తల్లి ఒడిలో నుంచి పాప జారి పడిపోయి ఉంటుంది అని పోలీసులు తెలిపారు. మున్నార్  రోడ్డులో అడవి మృగాలు, ఏనుగులు సంచరిస్తుంటాయి అని, ఈ రోడ్  లో ప్రయాణించడం చాలా ప్రమాదకరం అని పోలీసులు తెలిపారు. అలాంటిది ఈ చిన్నారి ఎటువంటి పెద్ద గాయాలు తాకకుండా ప్రాణాలతో బయట పడ్డాడం నిజంగా దేవుని మహిమ అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: