సంచలనమైన నిర్ణయాలతో ముందుకు దూసుకు పోతుంది భారత ప్రభుత్వం. అయితే తాజాగా కాశ్మీర్ విషయంలో భారత్ సంచలనమైన నిర్ణయం తీసుకోవటంతో పాకిస్తాన్ భారత్ పై కసితో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉగ్రదాడులకు పాల్పడి అల్లర్లు సృశ్టించాలని పాక్ భావిస్తోంది. ఇది ఇలా ఉండగా, దక్షిణాదిపై ఉగ్రవాదులు గురి పెట్టారా, మన నగరాల్లో దాడులకు పథకాలు రచించారా, పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నాయి.



దక్షిణాది రాష్ర్టాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టు తమకు సమాచారం ఉందని సదరన్ కమాండ్ జీఓసీ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ కె సైని వెల్లడించారు. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో సరిహద్దుల్లో అనుమానాస్పద పడవలు స్వాధీనం చేసుకున్నారు, సర్ క్రీక్ లీన్ దగ్గర ఇవి దొరికాయి. దేశాల్లోకి దొంగచాటుగా ప్రవేశించిన ఉగ్రవాదులవేనని అనుమానిస్తున్నాం అని అన్నారు. దీంతో పాటు దక్షిణాది రాష్ర్టాల్లో ఉగ్ర దాడులకు అవకాశం ఉందంటూ సమాచారం అందింది అని అన్నారు. సర్ క్రీక్ ప్రాంతంతో పాటు గుజరాత్ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు సైని.


ఉగ్ర దాడి హెచ్చరికలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక కూడా ఇచ్చారు. దక్షిణాదిన ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచినట్టు ఏపీ అదనపు డిజేపి రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని మోహరించినట్టు వివరించారు. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరాలయం, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ల వద్ద భద్రతను కట్టు దిట్టం చేశారు . బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, జనసమ్మర్థం ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచాలని పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి .



మరింత సమాచారం తెలుసుకోండి: