టీడీపీ చంద్రబాబు ఆత్మకూరు రాకను ఘనంగా స్వాగతిస్తున్నామని వైఎస్ ఆర్ సిపి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు  చెప్పారు. స్థానిక నేతలు కోడెల శివప్రసాద రావు, యరపతినేని. శ్రీనివాసరావు , జీవీ ఆంజనేయులులను వెంట తీసుకొస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. తెదేపా ఐదేళ్ల పాలనలో పల్నాడులో ఫ్యాక్షన్ని పెంచితే...తాము అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రశాంతంగా ఉందని స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బొల్లా ఇతర నాయకులు పాల్గొన్నారు. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ..జగన్ సీఎం అయిన 100 రోజుల్లో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. నిరుద్యోగులకు 4 లక్షల మందికి పద్దతి ప్రకారం ఉద్యోగాలను కల్పిస్తున్నారు. వరణుడు కరుణించి నదులు జలకళతో ఉట్టిపడుతూ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. చంద్రబాబు తన మనుగడను కాపాడుకునేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. వరద రాజకీయాలకు భిన్నంగా ప్రభుత్వం సమైఖ్యతాభావంతో భాధిత ప్రజలను ఆదుకుంది.



 శాంతి భధ్రతలకు విఘాతం కలుగుతుందని, హత్యారాజకీయాలు జరుగుతున్నాయంటూ బాబు మళ్ళీ కొత్త కథను తెరపైకి తెచ్చారని విమర్శించారు. జగన్  ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో  శాంతిభద్రతలను కాపాడేందుకు జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తామంతా  నడుస్తున్నామన్నారు. సంబంధం లేని విమర్శలు చేస్తూ తెదేపా ముందుకు నడుస్తుందని, హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన పార్టీ ఒక్క తెదేపా అని ఆరోపించారు. వినుకొండలో వైసీపీ మద్దతుదారులు అప్పట్లో తెదేపా నాయకుల దెబ్బకి ఊర్లు వదిలి వెళ్ళాపోయారని, హత్యా రాజకీయాలకు తెరలేపి గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. తెదేపా తన 5 ఏళ్ళ పాలనలో అవినీతి, అక్రమాలు, హత్యారాజకీయాలు జరిగాయి. స్పీకర్ గా  ఉండి కోడెల కుటుంబం, మైనింగ్ డాన్ యరపతినేని శ్రీనివాసరావు చేసిన అరాచకాలు అన్ని ఇన్నీ కావని అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే పునరావాస కేంద్రాల డ్రామాలకు తెర లేపారని ఆరోపించారు. మంచిని చెడుగా..చెడుని మంచిగా మల్చుకునే రాజకీయ జిత్తుల మారి చంద్రబాబు అని విమర్శించారు. తెదేపా పాత పద్దతిలోనే కొనసాగాలనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు గత కొంతకాలంగా రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడులో తెదేపా నాయకుల పై వైసీపీ దాడులు చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.




జగన్ సీఎం అయ్యాక పల్నాడులో మరింత ప్రశాంతతా చేకూరింది. 5 ఏళ్ళ తెదేపా పాలనలో పల్నాడులో ఫ్యాక్షన్ ని అభివృద్ధి చేశారని....వాళ్ళే కొట్టి వైసీపీ నాయకుల పై కేసులు పెట్టారని అన్నారు. యరపతినేని, కోడెల, పుల్లారావు, జీవీ ఆంజనేయులు చాలా అరాచకాలు చేశారని అన్నారు. గ్రామాల్లో ఉన్న చిన్న సంఘటనలను సరిచేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ఓడిన చంద్రబాబు ఛలో ఆత్మకూరు కు శ్రీకారం చుట్టి గుండాల వ్యవహరిస్తున్నారు. మాచర్ల, దుర్గి, నరసరావుపేట ప్రాంతాల్లో తెదేపా భాధితులతో కలిసి తామూ ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని బాధితులకు సమాధానం చెప్పేందుకు బాబు సిద్దంగా ఉండాలని చెప్పారు. ఉదయం 9గంటలకు వైసీపీ జిల్లా కార్యాలయం నుండి బయల్దేర్తామని అన్నారు. వచ్చే బాధితులందరికీ బాబు డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.బాధితుల్లేక పెయిడ్ ఆర్టిస్టులతో  బాబు రాజకీయం చేస్తున్నారని , అన్యాయం, అక్రమాలను ప్రజలకు చెప్పేందుకు తాము ఆత్మకూరుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ఛలో ఆత్మకూరుకు ఎస్పీ దగ్గర అనుమతులు కూడా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. గడిచిన పదేళ్ళల్లో నాగార్జున సాగర్ కుడికాల్వకు నీళ్ళు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని,  తమ ప్రభుత్వ హయాంలో నీళ్ళు వచ్చి రైతులంతా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. 




ప్రజలకు వాస్తవాలన్ని తెలుసు కాబట్టి ఇటువంటి డ్రామాలకు చంద్రబాబు తెరదించాలని సూచించారు. తమ పార్టీ నాయకుల పై తెదేపా హయాంలో జరిగిన దాడులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా పరిపాలన అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని... పోలీసులకు స్వేచ్చని కల్పించడంతో వారు ప్రశాంతంగా విధులను నిర్వర్తించుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీ మనుగడ కోసం పల్నాడులో చిచ్చుపెడితే కుటుంబాలు నాశనం అవుతాయని  ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పల్నాడులో ప్రశాంతమైన వాతావరణం నెలకొందన్నారు. తెదేపా పాలనలో పల్నాడులో 5 గురు వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఛలో ఆత్మకూరుకు తాము తెదేపా బాధితులతో కలిసి వస్తామని కానీ బాబొచ్చేటప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న కోడెలతో పాటు వారి కుటుంబ సభ్యులను, యరపతినేనిని కూడా తీసుకొస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: