బుధవారం చలో ఆత్మకూరు కార్యక్రమం నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు పోలీసులపై ఫుల్లుగా రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతల సమస్యపైనా ఘాటుగా మాట్లాడారు. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఏం తమాషా చేస్తున్నారా.. సీఎం జగన్ చెబితే మమ్మల్ని చంపేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అందర్నీ చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా అంటూ రంకెలు వేశారు.


ఆయన ఇంకా ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..

" వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వం. నా రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గపు పాలనను ఎన్నడూ చూడలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడతారా .. వైసీపీ దాడులను ప్రజలకు తెలియజేయాలని నిరసనకు పిలుపునిస్తే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా.. సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులకు పోలీసులు అరెస్ట్ లు చేసి కేసులు పెడుతున్నారు..


వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హత్య చేశారు. పలువురిపై అక్రమకేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. ఆత్మకూరులో 127 కుటుంబాలను గ్రామం నుంచి తరిమివేశారు.అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారా.. రాష్ట్రవ్యాప్తంగా 561 సంఘటనలు చోటు చేసుకోగా వాటిలో 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు పెట్టారు. 21 మందిని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులంటూ ఉద్యోగాల నుంచి తొలగించి వేశారు. 15 భూకబ్జాలు, 65 ఆస్తులను ధ్వంసం చేశారు. 68 మందిపై సోషల్‌ మీడియా కేసులతో వేధిస్తున్నారు.


గుంటూరులో 131 దారుణాలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలో దాడులపై 110 కేసులు నమోదుకాగా 38 ఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యలేదు. 13 ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు కాగా ఆరుగురి ఉద్యోగాలు తీసేశారు. ఈ దారుణాలు ప్రజలకు తెలియజేసేందుకే వైసీపీ బాధితుల క్యాంప్‌ పెట్టాం. పోలీసులకు ఎందుకు ఇంత బేషజాలకు పోతున్నారో సమాధానం చెప్పాలి. వైయస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదో చెప్పాలి."


మరింత సమాచారం తెలుసుకోండి: