ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను పూర్తిగా ఇండియాలో భాగస్వామ్యం చేసుకున్న తరువాత... పాక్ ఈ విషయంపై గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది.  జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలు లోపించాయని.. జమ్మూ కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది.  దీంతో పాటు, అనేక ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.  గురిగింజ కింద నలుపు ఎవరికి తెలియదన్నట్టు, ఈ ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.  


అంతర్జాతీయంగా ఇండియాను దోషిగా చేయాలనీ చూసిన పాక్, ఐక్యరాజ్యసమితిలో ఆరోపణలు చేసింది.  కంప్లైంట్ చేసింది.  ఎన్ని చేసినా.. పాక్ కు మాత్రం చేదు  అనుభవమే మిగులుతున్నది.  దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నది.  అయితే, ఇండియా పై కాశ్మీర్ విషయంలో పాక్ ఎందుకు అంతటి మొండి పట్టుదలను ప్రదర్శిస్తోంది అంటే దానికి కారణం చైనానే.  1947లో ఇండియాలో భాగస్వామ్యంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాక్ దురాగతంగా ఆక్రమించుకుంది.  


ఆ తరువాత అయితే, ఇండియా ఆ తరువాత దాని జోలికి వెళ్లలేదు.  ఆ తరువాత చైనాకు, పాక్ మధ్య దోస్తీ దోస్తీ కుదిరింది.  ఆక్రమించుకున్న భాగంలోనుంచి కొంత భాగం చైనాకు అప్పగించింది.  ఇది ఇండియాకు నచ్చలేదు.  పైగా  ఇప్పుడు చైనా.. పాక్ మధ్య ఎకనామిక్ కారిడార్ ను నిర్మించింది చైనా.  ఆ కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచే వెళ్తుంది. జమ్మూ కాశ్మీర్ ను ఇండియాలో పూర్తిగా విలీనం చేసిన తరువాత, రక్షణశాఖ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  పాక్ తో చర్చలు అంటూ జరిపితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనే అని, అది ఇండియాలో భాగం అని, దాన్ని వదిలే సమస్య లేదని చెప్పారు.  త్వరలోనే దాన్ని తిరిగి ఇండియాలో కలిపేసుకుంటామని అన్నారు.  


దీంతో పాక్ భయపడిపోతున్నది.  ఎందుకంటే, పాక్ నుంచి దాన్ని తీసేసుకుంటే.. ఎకనామిక్ కారిడార్ కు ముప్పు వాటిల్లుతుంది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఈ కారిడార్ వెళ్తుంది.  అలా వెళ్లడాన్ని ఇండియా ఎంతమాత్రం ఎప్పుకోదు.  దీనికోసమే పాక్ ఇండియాతో పేచీకి దిగుతున్నది.  పాక్.. చైనాల మధ్య ఈ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు జరిగితే.. అటు బలోచిస్తాన్ లోని విలువైన ఖనిజాలను పాక్ నుంచి చైనాకు ఈజీగా ఎగుమతి చేసుకోవచ్చు.  చైనాకు తక్కువ ధరకే వాటిని సొంతం చేసుకునేందుకు సిద్ధం అయ్యింది.  అటు ఆఫ్ఘన్ తో పాటు గల్ఫ్ దేశాలకు సైతం ఈజీగా రవాణా సాగించవచ్చు అన్నది చైనా ప్లాన్.  


మరింత సమాచారం తెలుసుకోండి: