రాజకీయ దుమారం తో పల్నాడు రగులుతుంది . ఎక్కడ చూసిన అరెస్టులు, గృహ నిర్బంధాలు. చలో ఆత్మకూరు అంటూ టీడీపీ అధినేత చంద్ర బాబు పిలిపునిచ్చిన నిరసనకు బయలుదేరుతున్న ప్రతి ఒక్కరిని కట్టడి చేస్తున్నారు. అయితే ఈ గొడవ ఇప్పటిది కాదు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి మొదలైన రగడ ... చిలికి చిలికి గాలి వాన అయినట్టు ...ఇప్పుడు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకి దారి తీసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ నేతలు  టీడీపీ పార్టీ శ్రేణుల పై  పరస్పర దాడులు చేస్తున్నారని...చంద్రబాబు వైసీపీ బాధితులకి అండగా ఉండేందుకు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు .


ఈ నేపథ్యంలో పోలీసులు న‌ర్సారావుపేట‌, స‌త్త‌న‌ప‌ల్లి, ప‌ల్నాడు, గుజ‌రాలాలో 144వ సెక్ష‌న్ విధించారు. ఎలాంటి నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేద‌ని రాష్ట్ర డీజీపీ గౌత‌మ్ సావంగ్ తెలిపారు.టీడీపీ నేతల అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును కూడా గృహ నిర్బంధం చేశారు పోలీసులు...దీంతో బాబు ఆయన  నివాసంలోనే నిరాహార దీక్షకు దిగారు. చంద్రబాబు గృహ నిర్బంధం చేయటం తో ...ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పునరావాస శిబిరాల్లో బాధితులకి ఆహరం అందించే ప్రక్రియను అడ్డుకోవటం దారుణమైన చర్య...బాధితుల పట్ల ఇంత దయలేకుండా వ్యవహరిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. కార్యకర్తలను రక్షించుకునేందుకు జైలుకి వెళ్లడానికి అయినా సిద్ధంగా ఉన్నానని వాళ్ళకి న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని బాబు స్పస్టం చేశారు. నన్ను ఇంట్లో పెట్టి చలో ఆత్మకూరు ఆపలేరు...చరిత్రలో  ఇలాంటి ఘటనలు ఎప్పుడు చూడలేదు అంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం బాధితులకి న్యాయం చేయటంలో విఫలం అయినా నేపథ్యంలో ...తాము ప్రజలకు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్నానని ...దీంతో టీడీపీ పై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని దుయ్యబట్టారు. న్యాయ పోరాటం చేస్తే అడ్డుకుంటారా అసలు మనం ప్రజాస్వామ్యం లోనే ఉన్నామా..? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు 


మరింత సమాచారం తెలుసుకోండి: