టిడిపి అధినేత చంద్రబాబు ఆత్మకూరుకు వెళుతుండగా పోలీసులు ఆపారు. ఆ తరువాత మీడియా తో ఆయన మాట్లాడుతూ,"వాడల్లో క్యాంపులో ఉండే వాళ్ళకు భోజనం కూడా లేకుండా చేయడం. మా ఇంటికి ఎవరైన వచ్చి పని చేస్తా ఉంటే వాళ్ళని కూడా రానివ్వకుండా చేయటం. పోలీసులు కూడా అక్కడక్కడా అత్యంత ఉత్సాహంతో ఇష్టానుసారంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం. ఇది ఒక పరిపాలించే వ్యక్తి యొక్క క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది.


ఇంతవరకూ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు మేము ఏమి అడుగుతున్నాము, ఎవరైతే ఇళ్ళల్లో నుంచి బయటకు పంపించిన ఐదు వందల నలభై కుటుంబాలను వాళ్ల ఊళ్లకు తీసుకువెళ్ళి, వాళ్ళు కూడా ఆ ఊర్లో ఉండటానికి అవకాశం కల్పించమన్నాము.ఈ దేశంలో రైట్ టు లీవ్ నివసించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇవన్నీ కూడా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. అదేమాదిరిగా ఈ రోజు పోలీసులు కూడా దీన్ని అమలు చేయాలి. ఆ విషయమే తొమ్మిదో రోజు చలో ఆత్మకూరు కంటే ముందు తొమ్మిది రోజులు టైమిచ్చాను. తొమ్మిది రోజుల టైమిచ్చి నిన్నటి వరకు టైమిచ్చిన తరువాత చెయ్యకపోతే నేను ఈ రోజు వెళదామనుకున్నాను. నన్ను ఇంత ఇది చేశారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను నన్ను ఇంట్లో పెడితే మీరు ఆపలేరు, మా ఎమ్మెల్యేలను, ఎంపీలను గృహ నిర్బంధం చేస్తే మీరు ఆపలేరు.పోలీస్టేషన్ కు తీసుకుపోతే మీరు ఆపలేరు చలో ఆత్మకూర్ నిరంతరం ఉంటోంది.



వదిలిపెట్టే సమస్య లేదు, వాళ్లు మమ్మల్ని అక్కడకి తీసుకుపోయి, అక్కడ బాదితులను తీసుకువెళ్ళి వారందరికీ ఆ గ్రామంలో నివసించే హక్కు కల్పించే వరకు ఈ పోగ్రాం కంటిన్యూ అవుతోంది. మీరెప్పుడు వదిలిపెడితే అప్పుడు నేరుగా వెళతాం, నేరుగా ఆ ఊరికే వెళ్తాం. వాళ్లను తీసుకొని వెళతాము అంతవరకు వదిలిపెట్టే సమస్యే లేదు, ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ డీజీపీ గాని, పోలీసులు గాని మీరేమి చేస్తారో చేయండి, ఇది మాత్రం రాజీ పడే సమస్యే లేదు. మళ్లీ ఎలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉండవలసిన అవసరం ఉంది. రెండవది వాళ్ల ఊర్లో వాళ్లు నివసించే హక్కు కల్పించే వరకు పోరాటం ఆగదు. ఆత్మకూర్ కార్యక్రమం కొనసాగుతుంది." అని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: