టీడీపీనేత,దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రెండువారాలుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే.ఇక ఆయనకోసం గత రెండు రోజులుగా పోలీసులు గాలిస్తున్న తరుణంలో ఎట్టకేలకు ఈ రోజు అరెస్ట్ అయ్యారు.ప్రభాకర్ తనపైఉన్న కేసుల కారణంగా గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు.ఆయన అజ్ఞాత వాసం వీడడానికి కారణం ఏంటంటే తన భార్యకు అరోగ్యం సరిగ్గాలేదన్న సమాచారం తెలుసుకున్న చింతమనేని ప్రభాకర్ స్వయంగా దుగ్గిరాలలోని తన నివాసానికి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి ఆయనను అరెస్ట్ చేశారు.



ఏలూరులోని త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అయితే చింతమనేని ప్రభాకర్ ఇంటికి చేరుకున్న సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నడుమ హైడ్రామా నడిచింది.తమ నాయకుడిని అరెస్ట్ చేయడాన్నినిరసిస్తూ టీడీపీ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో పోలీసులు వారినిచెదరగొట్టి, చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి అక్కడినుంచి తీసుకెళ్లారు.ముందుగా చింతమనేని ప్రభాకర్‌ను ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారించాలనే ఆలోచనలో ఉన్న పోలీసులు,ఇప్పుడు ఆయనపై వున్న పెండింగ్‌ కేసులను కూడా విచారణ చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.



ఓ వైపు గుంటూరు జిల్లాలో టీడీపీ చలో ఆత్మకూరు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తిన ఈ నేపథ్యంలో,దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సంఘటన జరగడానికి ముందే చింతమనేని ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.ఆంతే కాకుండా ఈరోజు ఉదయం ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు కూడా నిర్వహించారు.దీంతో ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు.చింతమనేని లొంగిపోతారని చెప్పినా ఎందుకు మీరుసోదాలు చేస్తున్నారంటూ అనుచరులు నిలదీశారు.ఇక దళితులను కులం పేరుతో దూషించారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.దీంతో ఆయన అజ్ఞాతంలో వెళ్లి ఈ రోజు బయటకు వచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: