జగన్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే కుట్రతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. చంద్రబాబు హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చూశాం, పోలీసులు అధికారులను చావబాదారు, వైసీపీ కార్యకర్తల్ని రోజూ వేధించారంటూ మండిపడ్డారు. చంద్రబాబునాయుడుగారికి రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు, నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎంపీలను మాకిచ్చి ప్రజలు పరిపాలన చేయమంటే శాంతి భద్రతల్ని కాపాడుతూ మేము పరిపాలన చేస్తోంటే చంద్రబాబునాయుడు గారు ఉక్రోషంతో దుగ్ధతో మా మీద లేని పోయినటువంటి ఆరోపణలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే కుట్రతో చంద్రబాబునాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు.

స్పష్టంగా మనకి కనపడతా ఉంది ఎక్కడ శాంతి భద్రతల సమస్య వచ్చింది, అసలు ఒక్క నిమిషం మనం వెనక్కి వెళితే చంద్రబాబునాయుడు గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో శాంతి లేదు, భద్రత లేదు ఆఖరికి పోలీసుల్ని కూడా కొట్టారు. విజయవాడ వేదికగా బాలసుబ్రహ్మణ్యం గారిని కొట్టారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్ళి వనజాక్షిని కొట్టారు, ఆఖరికి అనంతపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఎంఆర్వో ఆఫీసుకు వెళ్లి ఎంఆర్వో తోటి మాట్లాడుతుంటే ఎమ్మార్వో ఆఫీసుల్లోనే బహిరంగంగా పట్టపగలు హత్య చేసినటువంటిది తెలుగుదేశ ప్రభుత్వం ఈ రోజు మా గురించి మాట్లాడితే ఎలాగ అని మల్లాది విష్ణు మండి పడ్డారు. తొంభై రోజుల్లో, వంద రోజుల్లో పరిపాలనను మేము గాడిలో పెడుతూ ఉంటే చంద్రబాబునాయుడు గారికి ప్రజలిచ్చినటువంటి తీర్పును దృష్టిలో పెట్టుకుని ఎందుకంత చలో ఆత్మకూరు అని పిలుపు ఇవ్వాల్సినటువంటి అవసరముంది అని ప్రశ్నించారు.

డెమొక్రసీలో పొలిటికల్ పార్టీస్ అన్నీ ఎవరికి కావాల్సిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉన్నది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని చంద్రబాబునాయుడు గారు తాపత్రయపడతా ఉన్నారని మల్లాది విష్ణు వెల్లడించారు. చంద్రబాబునాయుడు గారు లేని పోయినటువంటి వ్యవహారాలన్నీ తెరమీదకు తీసుకువస్తా ఉన్నారని విష్ణు వ్యాఖ్యానించారు.

యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ గానీ, కోడెల శివప్రసాదరావు చేసినటువంటి అకృత్యాలు గానీ ఇతర కార్యక్రమాలు గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియకుండా, చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి ఘోరాలు, నేరాలు,కూన రవికుమార్ చేసినటువంటి వ్యవహారాలు ఆంధ్రరాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఒక పార్టీ చచ్చిపోతున్నటువంటి తరుణంలో ఆ పార్టీ పట్ల ప్రజలకు ఇచ్చినటువంటి తీర్పును దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ బిజెపిలోకో వేరే పార్టీలోకో పోతున్నటువంటి తరుణంలో నేను కూడా ఉన్నాను అని చెప్పడం కోసం మాత్రమే చంద్రబాబునాయుడు గారు ఈ కార్యక్రమంను చేస్తున్నారు అని విష్ణు తెలిపారు.

కొంత మందిని పంపిచవచ్చు, కొంతమందిని వేరే పార్టీలోకి పోవచ్చు, కొంతమంది రెడీగా మీటింగులు పెట్టుకుంటున్నారు, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు గారు అవుట్ డేటెడ్ అయిపోయాడని చెప్పి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతారని, నిన్నటి దాకా ఆయనతో ఉన్నటువంటి వ్యక్తి ఓ పెద్ద ఉత్తరం రాశారు. కావాలనే చంద్రబాబు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నాలను తిప్పికొడతాము అని మల్లాది విష్ణు అన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: