మాజీ కేంద్ర‌మంత్రి, బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు (టెక్నిక‌ల్‌గా టీడీపీ ఎంపీ) వైవీ సుజ‌నా చౌద‌రి త‌న రంగు మార్చుకున్నా త‌న స‌హాజ నైజాన్ని మార్చుకోలేక పోతున్నాడా... అందుకే ఇప్ప‌టికే పాత బాస్ చంద్రాలుకు అనుకూలంగానే మాట్లాడుతూ త‌న ఊస‌ర‌వెళ్ళి నైజాన్ని బైట‌పెట్టుకుంటున్నాడు.. ప‌సుపు పార్టీ నుండి క‌షాయ పార్టీకి మారినా కూడా త‌న నైజం మార‌దు అని స్ప‌ష్టం చేస్తూ టీడీపీ ఆధినేత చంద్రాలుకు వ‌త్తాసు ప‌లుకుతూనే ఉన్నాడు.


ఎంపీ సుజ‌నా చౌద‌రి కేవ‌లం త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోస‌మే బీజేపీలో చేరాడ‌ని గ‌త కొంత కాలంగా వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్న‌ట్లుగానే సుజ‌నాచౌద‌రి వ్య‌వ‌హారం ఉంది. బీజేపీలో కేవ‌లం అవినీతి కేసుల భ‌యంతోనే చేరిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉండ‌గా, బీజేపీలో చేరిన‌ట్లే గాని టీడీపీకి ఓ ర‌క్ష‌ణ క‌వ‌చంలాగా మారాడ‌ని తేట‌తెల్లం అవుతుంది. అందుకు నిద‌ర్శ‌నంగా ఒకే రోజు రెండు సంఘ‌ట‌న‌లు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. ఏపీ గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌ను  సుజ‌నాచౌద‌రి, మాజీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌లు క‌లిసారు. ఈసంద‌ర్భంగా రాజ‌ధాని త‌ర‌లింపుపైన పిర్యాదు చేశాడు.


సుజనాచౌద‌రి మాట‌ల్లో  జ‌గ‌న్ సర్కార్ కు ప‌రిపాల‌న‌పై దృష్టిలేద‌ని, కేవ‌లం ప్ర‌తిప‌క్షాల‌పై దాడి చేయ‌డ‌మే ఎక్కువ దృష్టి ఉంద‌ని ఆరోపించాడు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయన్నారు. పాలనపై వైసీపీ నేతలు దృష్టి పెట్టాలని కోరారు. పోలవరం, అమరావతిపై గందరగోళం నెలకొందన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఏకపక్ష ధోరణితో వెళ్తోందన్నారు. కేంద్రం హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆలస్యం చేయడం వల్ల ప్రతీ సీజన్‌లో 10వేల కోట్లు నష్టం వస్తుందని వివరించారు. టెండర్లు మార్చడం వల్ల 5 రూపాయలు కూడా ఆదా చేయలేరని పేర్కొన్నారు.


గోదావరి వరద ముంపు వల్ల తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని చెప్పిన సుజ‌నాచౌద‌రి త‌రువాత ప‌ల్నాడు సంఘ‌ట‌న‌పై కూడా స్పందిస్తూ చంద్రబాబు హౌజ్ అరెస్ట్ చేయ‌డాన్ని ఖండించాడు. ఏపీలో ఆరాచ‌క పాల‌న సాగుతుంద‌నే విధంగా కామెంట్లు చేశాడు. అంటే సుజ‌నా చౌద‌రి చంద్ర‌బాబు ఆత్మ‌గానే బీజేపీలో చేరాడ‌నే విధంగా, ఆయ‌న‌కు మేలు చేసే తీరుతోనే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. సో సుజ‌నా చౌద‌రి వ్య‌వ‌హరం చూస్తే త‌నువు ఒక‌చోట‌.. మ‌న‌స్సు ఒక చోట ఉన్న‌ట్లు స్ప‌ష్టం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: