వైసీపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు, గుంటూరులో అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. పల్నాడులో టిడిపి నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనేది వైసీపీ వాదన. చంద్రబాబు హయాంలో హత్యా రాజకీయాలు అవినీతి కేసులు ఎక్కువయ్యాయని వైసీపీ నేతలు అంటున్నారు. టిడిపి తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదని హెచ్చరిస్తున్నారు. వైసిపి కార్యాలయంలోనే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అంతా కూడా ఉన్నారు, కార్యకర్తలున్నారు. పల్నాడులోని చలో ఆత్మకూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.



అయితే పోలీసులు ఇప్పటికే కార్యాలయంలో బయటకు వెళ్లడానికి ఎవరికీ కూడా అనుమతి నివ్వలేదు. ప్రభుత్వం కావాలనే కుట్ర చెయ్యటం కాదు, ఒక కుట్రను ఎదుర్కోవడం కోసం మేం అనివార్యమైన పరిస్థితుల్లో చలో ఆత్మకూరు అనేటువంటి ప్రోగ్రాం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని అంబటి పేర్కొన్నారు. ఒక దారుణమైన కుట్ర చంద్రబాబునాయుడు గారు చేస్తున్నారు, వంద రోజుల పాలన జరిగిన తరువాత ఈ వంద రోజులు అధికారంలో లేక పోయినప్పటికీ చంద్రబాబునాయుడు గారికి ఒక ఫ్రస్ట్రేషన్ కలిగింది.



పల్నాడులో ఏదో గందరగోళం జరిపోతుందని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపి నేతలు అంటున్నారు. నిజంగా పల్నాడులో ఏదైనా దారుణం జరుగుతుంటే, పల్నాడులో శాసనసభ్యులంగానీ మంత్రులు గానీ లేకపోతే ప్రభుత్వం గానీ ఏదైనా కుట్ర చేసి ఎవరినైన అణిచివేయాడానికి ప్రయత్నం చంద్రబాబు చేస్తే కొంత అర్థం ఉంది అని, మాకు అలాంటి ఆలోచన లేదు మేము చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నాం అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.



పల్నాడులో మేం అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలుపొందాము అనీ పల్నాడులో జరిగినటువంటి ఏడు నియోజకవర్గాల్లో నర్సరావుపేట పార్లమెంట్ లో ఏడు నియోజక వర్గాల్లో ఏడు గెలిచాం, ఒక్కటి కూడా ఓడిపోలేదు అని ఆయన తెలిపారు. ఒక్కొక్కరు అత్యధిక మెజార్టీతో గెలిచారు అదే మెజార్టీ సాధించారు కాబట్టి అంతమంది ఎమ్మెల్యేలను కావాలని చెప్పి టిడిపి కార్యకర్తలను గ్రామాల నుంచి తరిమేస్తున్నారు అని అంటున్నారు అనీ, గ్రామాల నుంచి తరమాల్సిన అవసరం మాకేంటి చెప్పండి అని టిడిపి వాళ్ళు ఉంటే మాకేమైంది అని అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు వల్లే గ్రామాల్లో కక్షలున్నాయి అన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: