ఏమీ జరగని చోట కూడా ఏదో జరిగిపోతోందని జనాలను భ్రమల్లో ముంచేయటమే చంద్రబాబునాయుడు దగ్గరున్న విద్య. ఎందుకంటే ఎల్లోమిడియా మద్దతుంది కాబట్టి తాను అనుకున్న ప్లాన్ ను అనుకున్నట్లే అమల్లోకి తేగలరు చంద్రబాబు. ఇపుడు చలో ఆత్మకూరంటూ చంద్రబాబు చేసిన రచ్చ కూడా ఇందులో భాగమేనని సమాచారం.

 

అసలు చలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు చేసిన రచ్చ వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నాయంటున్నారు. మొదటిది గురజాల మాజీ ఎంఎల్ఏ  యరపతినేని శ్రీనివాస్ రావు అక్రమ మైనింగ్ కేసుపై తొందరలో సిబిఐ విచారణ మొదలు అవుతుండటమే. అక్రమ మైనింగ్ జరిగిపోయిందని తేలిపోయింది. కాకపోతే దాని వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయమే తేలాలి. ఒకసారంటూ సిబిఐ విచారణ మొదలైతే ఆ ముచ్చట కూడా తేలిపోతుంది. చంద్రబాబుకు ఇపుడిదే పెద్ద టెన్షన్ గా మారింది.

 

ఇక రెండో కారణం తొందరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలు. మొన్నటి ఎన్నికల్లో వైసిపి చేతిలో చావుదెబ్బ తిన్న తర్వాత రేపు జరగబోయే స్ధానిక ఎన్నికల్లో ఎంతమంది టిడిపి తరపున పోటి చేసేందుకు ముందుకొస్తారన్నదే అనుమానం. నేతలు, క్యాడర్లో ఆత్మస్ధైర్యం నింపాలంటే ఏదో ఒక రచ్చ చేయాలి. తన నాయకత్వం మీద అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్న నేపధ్యంలో అందుకే చంద్రబాబు రచ్చ చేసినట్లుంది.

 

చివరగా మూడో కారణం ఏమిటంటే కోడెల కుటుంబం నిర్వాకాలతో పార్టీ పరువు సాంతం రోడ్డున పడిపోవటమే. మొదట్లోనే కోడెల శివప్రసాద్ ను కట్టడి చేసుంటే వ్యవహారం ఇంతలా ముదిరేది కాదు. కానీ విచ్చలవిడిగా వదిలేయటం వల్ల కొడుకు శివరామకృష్ణ, కూతరు విజయలక్ష్మి అరాచకాలతో పార్టీ గబ్బు పట్టిపోయింది. అది కూడా చంద్రబాబు చెబుతున్న పల్నాడు ప్రాంతంలోనే ముఖ్యంగా.  సో ఈ మూడు కారణాలతోనే జనాలు, పార్టీ క్యాడర్ దృష్టి మరల్చేందుకే చంద్రబాబు చలో ఆత్మకూరంటూ నాటకాలు వేసినట్లు చెప్పుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: