వినాయక చవితి పండగ అంటే అందరికి ఆనందమే.ఎంచక్కా రోజు గణపయ్యను పూజిస్తూ,తమకు అన్ని విఘ్నాలు తొలగి ఆనందంగా వుండాలని ప్రతివారు కోరుకుంటారు.ఇక పిల్లలైతే చదువు బాగా రావాలని ఏకదంతున్ని ప్రార్దిస్తారు.అలా ఎంతో సందడిగా,మంత్రాలతో,భక్తి గీతాలతో పూజలందుకున్న వినాయకుడు ఇక సెలవంటూ వెళ్లుతున్న రోజు,భక్తులు చేసే బొజ్జగణపయ్యల శోభాయాత్ర ఎంతగా సందడితో నిండుకుని వుంటాయో చెప్పవలసిన అవసరం లేదు. వినాయక నిమజ్ఞనం రోజున చిన్న పెద్ద అందరు గణనాధునికి వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున బయలు దేరుతారు.అందుకే వీరందరి కోసం,నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్,రాచకొండ సైబరాబాద్,పోలీసు కమిషనరేట్ల పరిధిలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.



ఇప్పటికే చాలా చోట్ల వాహనాల మళ్లింపు కూడా చేశారు. గణపతి విగ్రహాల వాహనాలు తప్ప ఇతర వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. అంబులెన్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.అత్యవసర పనులు ఉన్నవారు మెట్రో రైలు లేదా ఎంఎంటీఎస్‌లను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.గణేశ్ నిమజ్జనం సందర్భంగా విచ్చేసే భక్తుల కోసం మెట్రో రైలు వేళల్ని కూడా అధికారులు పొడిగించారు.నిమజ్జనం పూర్తయ్యే వరకు మెట్రో సేవలు అందిస్తామని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ప్రతీ నాలుగున్నర నిమిషాలకో రైలును నడుపుతున్నామని,నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.



సాధారణ రోజుల్లో మియాపూర్,ఎల్బీనగర్ నుంచి రాత్రి పదిన్నర గంటలకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరుతాయని,కానీ నేడు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.ఇక ఖైరతాబాద్ వరకు మెట్రోలో సులభంగా చేరుకునే అవకాశం ఉండడంతో రైలు సమయాన్ని పొడిగించిన సందర్భంగా ఎందరో భక్తులు ఈ అవకాశాన్ని ఇప్పటికే సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: