ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ చాపకింద నీరు తరహాలో పావులను కడ్డుపుతుంది. ఈ క్రమంలో రాయలసీమ జిల్లాల్లో బలపడే దిశగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్టుగా రాజకీయ విశ్లేషకుల వాదన. రాష్ట్రంలోని కమలం పదాధికారుల కదలికలు కూడా అందుకు అనుగుణంగా ఉన్నాయంటున్నారు. బిజెపి నాయకుల యత్నాలు ఫలిస్తున్నట్టుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. డిల్లీలో కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా  జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అదే బాటలో రాష్ట్ర మైనార్టీ నేత, డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, మరి కోందరు నేతలు కమల దళంలో చేరనున్నారు.



కడపలో భారీ బహిరంగ సభ కు ఏర్పాట్లు చేస్తున్న బిజెపి శ్రేణులు పేర్కొంటున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో జిల్లాలో  రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించనున్నారు. మరో పక్కన  తాజా రాజకీయ  పరిణామాల నేపథ్యంలో ఈ నెల 16న బిజెపి ధర్నా సిద్దమవుతుంది.
ఇటీవలి కాలంలో టిడిపి నుంచి బిజెపిలో చేరిన వారిపై వైసీపీ నేతలు దాడులు చేయడం, వారికి ఉన్న రేషన్‌కార్డు తొలగించడం, అక్రమ కేసులు పెట్టడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కంటే ఎక్కువగా వైసీపీ సర్కారు తమ కార్యకర్తలను వేధిస్తోందని మండిపడ్డారు. దీనిపై ఆయన సర్కారును అనేకసార్లు హెచ్చరించినా, ఫలితం లేకపోవడం, వైసీపీ వేధింపులు పెరగడంతో 16న గురజాలలో ఆందోళనకు పిలుపునిచ్చారు.ఆ మేరకు పల్నాడులో బిజెపి కార్యకర్తలను భారీ స్థాయిలో సమీకరించే పనిలో బిజెపి నేతలు బిజీగా ఉన్నారు.





నిజానికి గత కొద్దిరోజు నుంచి బిజెపి నేతలు, కీలక కార్యకర్తలపై వైసీపీ చేస్తున్న దాడుల ఫిర్యాదులతో.. కన్నా నివాసం, బిజెపి ఆఫీసు కిక్కిరిపోతోంది. కన్నా లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధుతో మాట్లాడుతున్న సమయంలోనే అనేకసార్లు బాధితులు వచ్చి, తమను వైసీపీ నేతలు కొట్టారని, అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదుచేయడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్నాడు లోని అన్ని నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో పల్నాడు రాజకీయాలతోపాటు,రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం మీద ఆత్మకూరు ఘటనలు పల్నాడులో పోయిన పట్టు నిలబెట్టుకునేందుకు టిడిపికి, కొత్తగా పాగా వేసి క్యాడర్‌లో ధైర్యం ఇచ్చేందుకు బిజెపికి.. ఇటీవలి ఎన్నికల్లో సాధించిన పట్టు నిలబెట్టుకునేందుకు వైసీపీకి వేదికగా నిలిచాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.




ఇదిలా ఉండగా  భయం వద్దు.. మేమంతా మీ వెంటేనని అధినేత చంద్రబాబు భరోసా ఇస్తున్నప్పటికీ తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరు చారుకుంటున్నారు. పార్టీకి వెన్ను దన్నుగా నిలిచినవారంతా చేజారిపోతుండడంతో ఏ విధంగా కట్టడి చేయాలో తెలియని పరిస్థితుల్లో టీడీపీ మల్లాగుల్లాలుపతుంది. వలసల నివారించేందుకు అధినేత చంద్రబాబు యత్నాలు చేస్తున్న ప్రయోజనం కానరాని పరిస్థితి.  యత్నాలు ఫలించని చంద్ర బాబు .ఈ నెల 18, 19 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కడపలో మకాం వేసేందుకు సన్నర్ధమవుతున్నారు. చేజారిపోతున్న నేతలను కాపాడుకునే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారనే చెప్పాలి. కాగా ఈ  వలసలకు అధినేత తీరు, అసమ్మతి సెగలే  కారణమని ఆ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానించడం గమనార్హం.  



మరింత సమాచారం తెలుసుకోండి: