రాజకీయ నాయకులు పంచులు వేయాలంటే ఆలోచించాలి. అదే మరి సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే డైలాగులకు డైలాగులే పేలుతాయి. బండ్ల గణేష్ చిన్న స్థాయి నటుడి నుంచి టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు. గత ఏడాది ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని తెలంగాణా ఎన్నికల్లో నిలబడాలనుకున్నారు. టికెట్టు  రాలేదు, అయినా పార్టీ పదవి దక్కింది. ఆ టైంలో ఆయన కాంగ్రెస్ తెలంగాణాలో రాకపోతే బ్లేడ్ తో కోసుకుంటానని చాలెంజ్ కూడా చేశారు. తరువాత ఆయన కాంగ్రెస్ లో ఉన్నారో లేదో తెలియదు కానీ మళ్ళీ సినిమాలు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే ఏపీ పొలిటికల్ సినారియో మీద బండ్ల తాజాగా  పదునైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. ఏపీలో జగన్ నిద్ర లేవాలి, చంద్రబాబు నిద్రపోవాలి అంటూ మొదలెట్టిన బండ్ల వారు వీరు అని చూడకుండా అన్ని పార్టీలను బాగా వేసుకున్నారు. పలనాడు ఎపిసోడ్ తో ఏపీ పరువు పోయిందన్న బండ్ల బాబు కొంతకాలం కామ్ గా ఉండాలని చెప్పడం విశేషం.అదే సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతి, పోలవరం వంటి వాటి విషయంలో గందరగోళం పెట్టకుండా నిర్మాణాత్మకమైన  పాత్ర పోషించాలన్నారు. జగన్ మౌన ముద్ర, నిద్ర వీడాలని, ఏపీ అభివ్రుధ్ధి కోసం వేగంగా అడుగులు వేయాలని కోరారు. ఏపీకి ఒక రాజధాని ఉండాలని, అంతే తప్ప గందరగోళం ఉండరాదు అని కూడా ఆయన చెప్పారు.


 
ఇంతవరకూ బాగానే ఉన్నా బండ్ల తన కామెంట్లో భాగంగా  ఏపీలో  ఏ జెండా అజెండా లేని  పార్టీలు తప్పుకుంటే మంచిదని చేసిన హాట్ కామెంట్లు  ఎవరిని ఉద్దేశించి అన్న మాట ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. అలాంటి పార్టీ నాయకులు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే మంచిదని కూడా బండా సెటైర్లు వేశారు. మరి ప్రధాన  పార్టీలకు జెండాలు అజెండాలు ఉన్నాయి. బీజెపీ  జాతీయ స్థాయిలో కీలకంగా ఉంది. కాంగ్రెస్ అయితే నోరు ఎత్తకుండా రెస్ట్ తీసుకుంటోంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఉన్న పార్టీ జనసేన ఒక్కటే.


అంటే జనసేన గురించేనా బండ్ల విమర్శలు చేశారు అన్న చర్చ సాగుతోంది. పవన్ కి ఆప్తుడిగా పేరు పొందిన బండ్ల ఆ పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో చేరినపుడే ఏదో అనుకున్నారు. ఇపుడు బండ్ల ఇలా కామెంట్స్ చేస్తూంటే జనసేన గురించేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా బండ్ల చేసిన కామెంట్లలో కొన్ని బాగున్నాయి. ఏపీ అభివ్రుధ్ధికి అంతా క్రుషి చేయాల‌ని, వైసీపీ, టీడీపీ కలసి పనిచేయాలని ఆయన కోరిన విధానం బాగుందని అంటున్నారు. మరి ఓ సినీ నటుడిగానే కాకుండా బాధ్యత గల పౌరుడిగా బండ్ల చెప్పిన మాటలు నేతాశ్రీల చెవికి ఎక్కుతాయా.


మరింత సమాచారం తెలుసుకోండి: