చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కూన రవికుమార్ ఈ ముగ్గురు నేతలు అజ్ఞాతంలో ఉన్నారు. వీరిలో చింతమనేని ప్రభాకర్ బయటకొచ్చారు, అరెస్టయ్యారు. దుగ్గిరాల లోని తన నివాసానికి వచ్చిన చింతమనేనిని పోలీసులు బలవతంగా వ్యాన్ లోకి ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు. పన్నెండు రోజులుగా చింతమనేని అజ్ఞాతంలో ఉన్నారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు కేసులున్నాయి. దాదాపు యాభై రెండు కేసులు చింతమనేనిపై వున్నట్టు తెలుస్తోంది. కేసుల కారణంగా గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని బయటకొచ్చారు.దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పన్నెండు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న చింతమనేని సడన్ గా ఎందుకు బయటికొచ్చారు. నేరం చెయ్యనప్పుడు ఎందుకు పారిపోయావన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు చింతమనేనిని రెచ్చగొట్టాయనే చెప్పాలి. దీంతో ఆయన బయటకొచ్చారని ఓ రజన్ వినిపిస్తోంది. అయితే న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో ఆయన బయటకొచ్చి అరెస్టయ్యారని తెలుస్తోంది. చింతమనేని బయటకొచ్చారు, అరెస్టయ్యారు మరి ఆయన సంగతేంటి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వినిపిస్తున్న ప్రశ్న ప్రభుత్వ అధికారుల్ని బెదిరించిన కేసులో మాజీ ఎంఎల్ఏ కూన రవి కుమార్ తో పాటు మరో పదకొండు మంది పై గత నెల ఇరవై ఏడున కేసు నమోదైంది.



ఈ కేసులో ఇప్పటికే పది మంది సరెండరయ్యారు. వీరిలో ఎ వన్ అయిన కూన రవి కుమార్ ముందస్తు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కింది కోర్టు లో బెయిల్ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో హై కోర్టు లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వరుస సెలవుల కారణంగా ఆయనకు బెయిల్ పిటిషన్ విచారణకు రావడం లేదు. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న చింతమనేని వచ్చి అరెస్టయ్యారు.



ఇప్పుడు కూన రవి కుమార్ కూడా పోలీసులకు లొంగిపోతారా లేదా ముందస్తు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కొనసాగిస్తారా అనే విషయంపై కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది.అయితే రవికి ముందస్తు బెయిల్ వస్తుందని అందుకే ఆయన అజ్ఞాతం వీడడం లేదని అనుచరులు చెబుతున్నారు. కూనా రవి కోసం పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయనకు బెయిల్ వచ్చే లోపే అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అటు ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డికి కూడా నోటీసులు రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ రాకపోతే ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: