విశాఖ టీడీపీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. అర్బన్ పార్టీలో ఇద్దరు నేతల మధ్య వార్ తీవ్రస్థాయికి చేరింది. అర్బన్ పార్టీ అధ్యక్షుడు రెహ్మాన్ నాయకత్వాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీ ఆఫీసుకు రానని ఎమ్మెల్యే శపథం చేశారు, అన్నట్లుగానే అర్బన్ పార్టీ సమావేశాలకు రావడం లేదు. విశాఖ టీడీపీ ఆఫీసులో ఇటీవల నాలుగు కీలకమైన మీటింగులు జరిగాయి, మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు కూడా ఈ సమావేశానికి వచ్చారు. కానీ వాసుపల్లి గణేష్ మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు.



ఇటు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలకు అర్బన్ పార్టీ అధ్యక్షుడుకి కనీసం పిలుపు ఉండలేదు. విశాఖకు ప్రధాన కార్యదర్శి లోకేష్ వచ్చిన రోజే బాచుపల్లికి రెహమాన్ ఘాటైన లేఖ రాశారు. పార్టీ జెండా పై గెలిచిన మీరు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ లేఖకు అదే లెవల్లో బాసుపల్లి సమాధానమిచ్చారు, అర్బన్ పార్టీ అధ్యక్షుడుగా రెహ్మాన్ ను అంగీకరించడం లేదంటూ బాంబుపేల్చారు. అతని ఎన్నిక పద్ధతి ప్రకారం జరగలేదని విమర్శించారు. ఎమ్మెల్యే వాసుపల్లి రెహమాన్ మధ్య సంబంధాలు దెబ్బతినటానికి బలమైన కారణాలు ఉన్నాయనేది పార్టీ వర్గాల విశ్లేషణ. ఎన్నికల ముందే వీరి మధ్య విభేదాలు ముదిరాయి, దీంతో జోక్యం చేసుకున్న అధిష్టానం ఏడేళ్ళపాటు అర్బన్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న బాసుపల్లిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు.



బాచుపల్లికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, రెహ్మాన్ కు అర్బన్ పగ్గాలు అప్పగించారు అయితే, అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా టిడిపి ఘోరంగా దెబ్బతింది కానీ, విశాఖ సిటీలో మాత్రం ఫలితాలు కాస్త ఊరట ఇచ్చాయి. నగరాల్లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు, కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో వస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ రెహ్మాన్ వాసుపల్లి గణేష్ మధ్య వార్ పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే చర్చ పార్టీలో నడుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: