ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో పూర్తిగా విలీనం అయ్యింది. జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.  దీంతో అక్కడ రక్షణ తో పాటు పోలీసు వ్యవస్థ కూడా కేంద్రం పరిధిలోనే ఉంటుంది.  అంతేకాదు, ఇండియాలో జమ్మూ కాశ్మీర్ విలీనం కావడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవచ్చు.   విచారణ చెయ్యొచ్చు.  ఒకప్పటిలాగా అక్కడి ప్రభుత్వాన్ని అడిగి చర్యలు తీసుకునే చట్టాలు తొలగిపోయాయి. 


ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ పూర్తిగా విలీనం అయ్యిందో అప్పటి నుంచి అక్కడ రగడ చాలావరకు తగ్గిపోయింది.  పెద్దగా అల్లర్లు జరగడంలేదు.  చాలా వరకు కంట్రోల్ లోకి వచ్చింది.  ఇలా కంట్రోల్ లోకి రావడంతో కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు.  అయితే, ఇండియాను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాలని చూస్తున్న పాకిస్తాన్ కు మాత్రం జమ్మూ కాశ్మీర్ ను విలీనం చేయడం నచ్చలేదు.  అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని చూసి భంగపడిందో.  


అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ విషయంలో పాక్ కొన్ని రోజుల క్రితం దూకుడును ప్రదర్శించింది.  అక్టోబర్ లో భారత్ తో యుద్ధం చేస్తామని, జమ్మూ కాశ్మీర్ ను ఇండియా నుంచి విముక్తి చేస్తామని బీరాలు పలికింది.  బోర్డర్ లో హడావుడి చేసింది.  లడక్ సరిహద్దుల్లో యుద్ధ విమానాలను మోహరించింది.  దీంతో పాటు అణుదాడి చేస్తామని బెదిరించింది.  ఈ బెదిరింపులకు ఇండియా బెదిరిపోలేదు.  పాక్ పైకి చెప్తూ గాంబీర్యం ప్రదర్శిస్తే.. ఇండియా మాత్రం సైలెంట్ గా తనపని తాను చేసుకుంటూ పోతున్నది.  


ఇప్పటికే బోర్డర్ లో గస్తీని పెంచింది.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది సైన్యం.  ఇదే విషయాన్ని బిపిన్ రావత్ స్పష్టం చేశారు.  తమ నెక్స్ట్ అజెండా పీవోకే అని, పీవోకే ను త్వరలోనే సాధించి తీరుతామని అన్నారు.  ఇండియా సైన్యం సిద్ధంగా ఉందని, కేంద్రం నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం అని చెప్పారు.  కేంద్రం ఆదేశిస్తే.. ఒక్కరోజులోనే పీవోకే ను తిరిగి ఇండియాలో కలిపేస్తామని అన్నారు.  గత కొన్ని రోజులుగా పీవోకే విషయంలో మంత్రులు, ఎన్డీయే నేతలు, అటు రక్షణ మంత్రి కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడంతో.. పీవోకే త్వరలోనే ఇండియాలో విలీనం అవుతుందనే నమ్మకం ఏర్పడింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: