కొన్ని రోజుల క్రితం ఇతర గ్రహంపై నడిచిన నడిచిన విధంగా బెంగళూరుకు చెందిన నంజుండస్వామీ మూన్ వాక్ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  అయితే, ఆ వీడియో ఇస్రోకు సపోర్ట్ గానో చంద్రయాన్,  గగన్ యాన్ కోసమే చేసింది కాదు.  రోజు ప్రయాణించే రోడ్లు సరిగా లేకపోవడంతో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి,   వినూత్నంగా ప్రయోగం ప్రయోగం చేశాడు.  సక్సెస్ అయ్యాడు.  అయన మూన్ వాక్ కు మంచి పేరు వచ్చింది.  అధికారుల్లో చలనం వచ్చింది. గుంతలపై తారు మొలిచింది.. నల్లని తారు రోడ్డు సిద్ధం అయ్యింది. 

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చాలామంది అదే తరహా ప్రయోగం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  మనవాళ్ళు చాలామంది ఇదే తరహా ప్రయోగంతో రోడ్లపై నడుస్తూ.. అధికారుల్లో చలనం తీసుకొస్తున్నారు.  అయితే, మెక్సికో కు చెందిన బోవెడ సెలేస్తే అనే ఏజెన్సీ నంజుండస్వామి తరహా ప్రయోగం చేయడానికి సిద్ధం అయ్యింది.  దానికోసం అతని అనుమతి కోరింది.  అందుకు అయన సరే అని చెప్పడంతో ఆ ఏజెన్సీ కూడా తమ రోడ్ల దుస్థితిని ప్రభుత్వానికి తెలియజేస్తూ.. ఆ తరహా ప్రయోగం చేసింది.  


రోడ్లు బాగుచేయాలని నిరసనగా ప్లకార్డులు పట్టుకొని కూర్చుంటే సరిపోదు. దానికంటే కూడా ఇలా వినూత్నంగా నిరసనలు తెలియజేస్తే ప్రభుత్వం దిగివచ్చి వెంటనే పనులు చేస్తోందని దానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు.  ఇప్పటికే చాలామంది ఈ తరహా ప్రయోగాలు చేస్తుండటంతో.. ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా రోడ్లను మరమ్మత్తు చేయిస్తోంది. అసలే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కొత్త వాహన  చట్టం అమలులో ఉన్నది.  ఈ వాహన చట్టం ప్రకారం చలానాలు వసూలు చేయాలంటే ముందు రోడ్లు బాగుండాలి.  


రోడ్లు బాగాలేవని, ముందు రోడ్లు బాగుచేసి ఆ తరువాత చలానా వేయండని చాలామంది వాహనదారులు చెప్తున్నారు.   ఇక కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్లు రోడ్ల విషయంలో ఎంత నాసిరకంగా రోడ్లు వేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.  ఎండకాలంలో ఎండలకు రోడ్డుపై ఉన్న తారు కరిగిపోతుంది.. వానాకాలంలో ఒక అరగంట వర్షం కురిస్తే చాలు రోడ్లపై గుంతలు ఏర్పడతాయి.. ఇలా నాసిరకం రోడ్డు వేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాంట్రాక్టర్లు.  కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. రోడ్డు కాంట్రాక్టులు తీసుకునే సమయంలో కొన్ని కఠిన నియమాలను తీసుకొస్తే.. రోడ్లు బాగుపడతాయి.  లేదంటే ఇలానే ఉంటాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: