ఆర్టికల్ 370ని రద్దు చేశారని, ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరుగుతోందని, అక్కడి ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని, సైన్యం అక్కడి మహిళపై అఘాయిత్యాలు చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెడుతున్నది.  అంతర్జాతీయంగా ఇండియాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది.  అయితే, పాక్ చెప్పే మాటలు అంతర్జాతీయంగా ఏ దేశాలు నమ్మడం లేదు.  కారణం, ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే.  ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తునే..తమ దగ్గర ఉగ్రవాదులు లేరని గతంలో వాదించింది.  


ఒసామా బీన్ లాడెన్ వంటి ఉగ్రవాదులను అమెరికా పాకిస్తాన్లోకి ప్రవేశించి.. హతమార్చింది.  అప్పటి వరకు పాకిస్తాన్ కు లాడెన్ పాక్ లోనే ఉన్నాడనే సంగతి తెలియదా..? తెలిసి కూడా సైలెంట్ గా ఉండటం వెనుక ఉద్దేశ్యం ఏంటి..? అయితే, ఇటీవలే పాక్ తమ దేశంలో 40వేలమంది ఉగ్రవాదులు ఉన్నారని చెప్పింది. అక్కడితో ఆగకుండా రీసెంట్ గా మసూద్ ను రహస్యంగా రిలీజ్ చేసి పీవోకేకు పంపడం వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.  


ఇక పాక్ లో ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోందని అక్కడి మంత్రినే స్వయంగా చెప్పడం విశేషం.  మంత్రులే స్వయంగా ఇలాంటి విషయాలను చెప్తుంటే.. పాక్ ప్రధాని మాత్రం ఇంకా కాశ్మీర్ గురించి మాట్లాడుతుండటం విచిత్రంగా ఉన్నది. ఇదిలా ఉంటె, బలూచిస్తాన్ కు చెందిన బలూచ్ మానవహక్కుల సంఘం, పస్థూన్స్ ఉద్యమకారులు కొంతమంది కలిసి ఐక్యరాజ్య సమితికి సమీపంలో పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. 


పాకిస్తాన్ లో మానవహక్కుల పరిస్థితులు హేయంగా ఉన్నాయని, ప్రజలను నానారకాలుగా హింసిస్తున్నారని, దేశంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన విషయాన్ని పట్టించుకోకుండా.. కాశ్మీర్ లో మానవహక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బలూచ్ ఉద్యమకారుడు రజాక్ బలూచ్ పేర్కొన్నారు.  పాక్ సైన్యం అధీనంలో ఉన్న బలూచిస్తాన్ లోని ప్రజల జీవితాలు దారుణంగా ఉంటున్నాయని, అక్కడి ప్రజలు మాయం అవుతున్నారని, ఏమౌతున్నారో తెలియడం లేదని అన్నారు.  బలూచిస్తాన్ లో జరుగుతున్న అకృత్యాల గురించి పాక్ మాట్లాడటం లేదని, పాక్  విదేశాంగమంత్రి సైతం బలూచిస్తాన్ గురించి మాట్లాడకపోవడంతో తాము ఇలా రంగంలోకి దిగాల్సి వచ్చిందని బలూచ్ ఉద్యమకారులు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: