తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగురవేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బిజెపి కాంగ్రెస్, టిడిపిలతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీపై సైతం ఆపరేషన్ ఆకర్ష మంత్రాన్ని వేగంగా అమలు చేస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ఎదురుగా నిలబడే పార్టీలే ఉండకూడదన్న కాన్సెఫ్ట్‌తో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్‌లో ఎడాపెడా చేర్చేసుకున్నారు. లోక్‌స‌భ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అవడంతో ఇప్పుడు బిజెపి అంతే దూకుడుతో టిఆర్ఎస్ పార్టీ పై ఎటాక్ వస్తోంది.


అసెంబ్లీలో సంఖ్యాపరంగా చాలా బలంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల‌ను సైతం తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మంత్రాన్ని రాష్ట్రంలో మ‌రింత వేగంగా అమ‌లు చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది.  తెలంగాణ‌పై ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ప్ర‌త్యేక దృష్టి సారించారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదును హైద‌రాబాద్ నుంచే ప్రారంభించారు. అంతేగాక బ‌లం పెంచుకునేందుకు వివిధ పార్టీల నుంచి చేరిక‌ల‌ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నారు.


ముఖ్యంగా టీఆర్ఎస్‌లో అసంతృప్త నేత‌లు ఎవ‌రు ఉన్నా కూపి లాగి మ‌రీ వారిపై వ‌ల వేస్తోంది. తాజాగా భోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ అహ్మ‌ద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌ను క‌ల‌వ‌డంతో పాటు పార్టీ మారితే మార‌వ‌చ్చ‌ని కూడా చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తే బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కూడా వ‌ద‌ల‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతోపాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ టీఆర్ ఎస్ అ ధ్య‌క్షుడు, మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి లాంటి నేత‌లు కూడా గులాబీ టార్గెట్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: