తెలంగాణ రాష్ట్ర వైధ్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌. ఆయ‌న‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని నేత‌. తెలంగాణ ఉద్య‌మంలో చురుకైన పాత్ర పోషించిన నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. ఆయ‌న ఇప్పుడు టీ ఆర్ ఎస్‌లో ఓ తిరుగుబాటు కెర‌ట‌మైనారు. అయితే క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌. ఇత‌డు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద‌గా ఎవ‌రికి తెలిసిన నేత కాదు. కానీ క‌రుడు క‌ట్టిన తెలంగాణ వాది, క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ప‌నిచేసిన బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్‌ను ఓడించిన నేత‌గా అంద‌రికి సుప‌రిచితుడైనాడు. ఇప్పుడు ఇద్ద‌రు భిన్న‌ధృవాలు. ఒక‌రు ఉత్త‌ర దృవం అయితే మ‌రొక‌రు ద‌క్షిణ దృవం.


ఈ భిన్న‌ధృవాలు ఎప్పుడు క‌లువ‌వు.. కానీ ఎందుకో ఉత్త‌ర ధృవంగా ఉండే మంత్రి ఈటెల రాజేంద‌ర్‌పై ద‌క్షిణ దృవంలో ఉండే బీజేపీ ఎంపి బండి సంజయ్ సానుభూతి ప‌వ‌నాలు విసురుతున్నాడు. అయితే తెలంగాణ‌లో అధికార టీ ఆర్ ఎస్ పార్టీని దెబ్బ తీయాలంటే ఆ పార్టీలోని కొంద‌రు ముఖ్య‌మైన నేత‌ల‌ను బీజేపీ వైపు తిప్పుకోవాల‌ని, దానితో అటు టీ ఆర్ ఎస్ బ‌ల‌హీన ప‌డ‌టం, బీజేపీ బ‌ల‌ప‌డం జ‌రుగుతుంద‌ని బీజేపీ అగ్ర‌నేత‌ల ఆలోచ‌న‌ట‌. అందుకే బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఇప్పుడు టీ ఆర్ ఎస్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ, పార్టీలో అస‌మ్మ‌తి రాగం వినిపిస్తున్న నేత‌ల‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డింది.


అయితే మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఇటీవ‌ల గులాబీ ఓన‌ర్లం అంటూ కామెంట్ చేయ‌డంతో అది రాష్ట్ర‌వ్యాప్తంగా ఓ సంచ‌ల‌నంగా మారింది. అయితే ఈ విష‌యం అంత  మ‌రిచిపోయినా బీజేపీ నేత‌లు మాత్రం మ‌రువడం లేదు.. ఈ ఇష్యూను ఎంత పెద్ద‌ది చేస్తే అంత లాభం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే ఈటెల‌ను పార్టీలోకి ర‌ప్పించుకునేందుకు ఆయ‌న‌కు టీ ఆర్ ఎస్ పార్టీ పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టాల‌ని అందుకే స‌మ‌సిపోయిన విష‌యాన్ని ప‌దే ప‌దే పెద్ద‌ది చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఎంపీ బండి సంజ‌య్ చూపుతున్న వ‌ల్ల‌మాలిన ప్రేమే నిద‌ర్శ‌నంగా మారింది. 


ఈటెల మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించాల‌ని, అత‌ని వెనుక మేమంతా ఉంటామ‌ని బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. అంటే ఈటెల‌ను ఎలాగైనా బీజేపీలోకి తీసుకుంటే బీజేపీకి రాష్ట్రంలో మైలేజ్ పెరుగుతుంద‌ని బీజేపీ నేత‌ల ఆలోచ‌న‌.. సో ఇప్పుడు బీజేపీ నేత‌లు వేస్తున్న పాచిక‌లు పారుతాయో.. లేదో వేచి చూడాలి మ‌రి.



మరింత సమాచారం తెలుసుకోండి: