పాకిస్థాన్ ఎందుకు భయపడుతోందో  అదే జరిగేట్టు ఉంది. పాక్ ఎందుకు వణుకుతోందో  అదే నిజమయ్యేట్లుంది. భారత్ తో ఎందుకు పెట్టుకున్నామా అని పాక్ ఇపుడు కలవరపడే పరిస్థితులే వచ్చాయి. రోజులెపుడూ ఒకేలా ఉండవు కదా. భారత్ లో రాజకీయ నాయకత్వం మెతక‌గా ఉంటుందని, మా ఆటలు ఎల్లపుడూ ఇదే విధంగా సాగుతాయని పాక్ భావించింది. అది తప్పని గత అయిదేళ్ళుగా రుజువు అవుతోంది.


తాము కచ్చితమైన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, అవి కనుక వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దండెత్తడం ఖాయమని పక్కా క్లారిటీగా భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పేశారు. ఈ వార్త ఇపుడు పాక్ గుండెళ్లొ వేయి ఫిరంగుల మోత లాగానే  ఉందంటున్నారు. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఇపుడు ఆర్మీ కొత్త ఉత్సాహంతో ఉంది. ఇన్నాళ్ళు చేతగాకపోయినా రాజకీయ నాయకత్వం మాటలు వినాలి కాబట్టి చేతులు ముడుచుకున్న ఆర్మీ ఇపుడు దూకుడు మీద ఉంది. పాక్ ఆటలు కట్టించేందుకు ఉబలాటపడుతోంది. అందుకు కనుక కేంద్రం సై అంటే చాలు ఉరికేందుకు రెడీగా  ఉన్నారు. ఇదే విషయాన్ని బిపిన్  రావత్ చెప్పుకొచ్చారు. పీఓకే పై దాడి చేసేందుకు తాము ఎపుడైనా రెడీ అని ఆయన అంటున్నారు.


నిజానికి 72 ఏళ్ళుగా పీఓకే పాక్ చేతిలో బంధీగా ఉంది.  కాశ్మీర్ లో  మూడవ వంతు భూభాగం పాక్ ఆక్రమించి అట్టేపెట్టుకుంది. ఇపుడు దాన్ని కలిపితేనే కాశ్మీర్ సంపూర్ణం అవుతుంది. అందువల్ల అఖండ భారత్ విషయంలో బీజేపీ చేస్తున్న రాజకీయ ప్రకటనలు ఓ వైపు ఉంటే ఆర్మీ కూడా అందుకు రెడీ అనడంతో పాక్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతోంది. ఇదిలా ఉండగా బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా అఖండ భారత్ పాట అందుకుంది. 2022 నాటికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా భారత్ లో కలిపేయడం ఖాయమని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కీలక  ప్రకటన చేశారు. దానికి అటూ ఇటూగా ఆర్మీ చీఫ్ కూడా ప్రకటన చేయడంతో కేంద్రం  సీరియస్ గానే ఈ విషయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే కనుక జరిగితే పాక్ నెత్తి మీద మోత మోగినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: