చలో ఆత్మకూరు కార్యక్రమం వల్ల టీడీపీకి  ఏ మేరకు ప్రయోజనం  చేకూరిందో తెలియదు కానీ ఆ పార్టీ నేతలపై మాత్రం కేసులు నమోదయ్యాయి . పోలీసులతో అనుచితంగా ప్రవర్తించి , దుర్భాషలాడారన్న కారణంగా ఒకరిపై , కులం పేరిట దూషించారన్న అభియోగంతో  మరొకరిపై పోలీసులు కేసులు నమోదు చేయడం తెలుగుదేశం పార్టీ వర్గాలను షాక్ కు గురి చేసింది . తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత,  టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.


 బుధవారం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన చలో ఆత్మకూరు పిలుపులో భాగంగా పోలీసులు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే.  కృష్ణానది కరకట్ట పై ఉన్న ఆయన ఇంటి వద్దకు చేరుకున్న అచ్చెన్నాయుడు విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ,  చంద్రబాబు ఇంట్లో కి వెళ్తున్న తనని అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడారు . బందోబస్తు లో భాగంగా కరకట్ట పై విధులు నిర్వహించిన ఎస్ ఐ లు సదారి, కోటయ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అచ్చెన్నాయుడు పై చట్ట ఉల్లంఘన , విధి నిర్వహణ లో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే  అభియోగం పై కేసు నమోదు చేశారు .


 ఇక మంగళగిరి పోలీసులు టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి పై కేసు నమోదు చేశారు . ఈ దళితులతోనే దారిద్రమంతా వచ్చిందని  విధుల్లో ఉన్న ఓ మహిళ ఎస్ ఐ ఉద్దేశించి రాజకుమారి చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి . దీనితో మనస్థాపానికి గురైన సదరు ఎస్ ఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం తో,   కులం పేరిట  దూషించారనే అభియోగం తో రాజకుమారి మీద  కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: