కేంద్రంలోని  నరేంద్ర మోడీ ప్రభుత్వం  కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెపుతుంది.ఇకపై శాశ్వత ఉద్యోగుల తరహాలోనే కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా కనీస వేతనాలు వర్తించేలా కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. దీనితో  ఇకపై రెగ్యులర్ ఉద్యోగాల మాదిరిగానే  వీరికి కూడా కనీస వేతనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగుల్లాగే  వేతనం అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి.  దీనికి సంబంధించి సెప్టెంబర్ 11, 2019న ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. తాత్కాలిక కార్మికులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనాలు లభిస్తాయని 2016 లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 



సుప్రీంకోర్టు సంతకం చేసిన మూడేళ్ల తర్వాత ఈ ఉత్తర్వులు జారి అయ్యాయి. రోజుకు 8 గంటలు పనిచేసే కాంట్రాక్టు కానీ తాత్కాలిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులతో దశ మారబోతుంది. ఇకనుంచి వారందరికీ శాశ్వత ఉద్యోగిలా కనీసం వేతనంతోపాటు అలవెన్సులు లభిస్తాయి. అయితే కాంట్రాక్టు కార్మికులు  వారు ఎన్ని రోజులు పనిచేస్తారో అన్ని రోజుల వేతనం మాత్రమే చెల్లించబడుతుంది. అయితే  సమాన పనికి సమాన వేతనం వారు క్రమబద్ధీకరించబడతారని కాదు. ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు  కనీస ప్రాథమిక వేతనం అందిస్తున్నాయి. 





ఉదాహరణకు నైపుణ్యంలేని కార్మికులకు కనీస ప్రాథమిక వేతనం రూ.14 వేలుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.  అది ఇప్పుడు రూ .30 వేలకు చేరుకుంటుంది. ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగి శాశ్వత ఉద్యోగి కంటే అర్హత ఎక్కువగా ఉంటే  రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతనికి కనీస వేతనం లభిస్తుంది. తాజా ఉత్తర్వుల గురించి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉత్సాహంగా లేరని భారతీయ మజ్దూర్ సంఘ్  పేర్కొంటుంది. ఇలాంటి  ఆదేశాలు ఇంతకుముందు కూడా  జారీ చేయబడ్డాయి  కానీ ఎప్పుడూ అమలు కాలేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారని ఆ సంఘం జాతీయ నాయకులూ ఏ . రవి శంకర్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: