ఆర్థిక మాంద్యమంటే వ్యాపారలావాదేవీలు సన్నగిల్లి, ఉద్యోగావకాశాలు సన్నగిల్లి  ధనం చేతులు మారక కొనుగోలుశక్తి నశించటమేనంట. ప్రజలలో కొనుగోలు శక్తి నసిస్తే ఉత్పత్తి రంగం  దెబ్బతుంటుంది. ఫలితంగా మరింతగా నిరుద్యోగ సమస్య  పెరిగిపోతుంది. చివరకు దేశాల ఆర్ధిక వ్యవస్థ   చిన్నాభిన్నమౌతుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రమాదం నుండి బయటపడటానికి ప్రభుత్వాలు పరిశ్రమలకూ, ఆర్ధిక సంస్తలకూ కొన్ని రాయితీలను ప్రకటిస్తాయి. 



తద్వారా  ఆయా సంస్థలు మనుగడ కాపాడుకొంటాయి. పరోక్షంగా దేశంలో  నల్లబజారుదారుల వద్దను , తీవ్రవాదుల దగ్గర గల ధనాన్ని అంతమొందించటం అనే లక్ష్యాలుగా ప్రకటించి చేసిన ఆకస్మిక పెద్దనోట్ల రద్దును కారణంగా చెపుతున్నారు. స్వల్ప కాలాంతరంలోనే సంపూర్ణ అవగాహన కల్పించకుండా అమలులోకి తెచ్చిన జీఎస్టీ విధానాల వల్ల క్రమక్రమంగా అనేక సంఘటిత ,అసంఘటిత వ్యాపారాలు, వర్గాలు బక్క చిక్కి బలిపీఠమెక్కాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ కారణంగా, ప్రజలు ఇప్పటికే ఆర్ధిక మాంధ్యం అనుభవిస్తున్నారు. కానీ ప్రభుత్వంగానీ, వారిని సమర్ధించే నాయకులు, ప్రజలు గానీ ఇప్పటికీ ఆ నిర్ణయాలపై శ్రద్ద చూపించండం లేదు.




ఈ విషయాన్ని  అంగీకరించకపోవటమే ఈ ఆర్ధిక మాంద్యానికి కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  దేశ వ్యాప్తంగా వచ్చింది హార్డ్ కోర్ మాంద్యం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.  ఇది ఇప్పటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విషాన్ని వ్యాప్తి చేసింది. మొత్తం ఆర్థిక మార్కులో దాదాపు 13.67 శాతం పతనం నమోదైంది. విదేశీ మారకం రేపు రేటులో కూడా సంక్షోభం ప్రారంభమైందని సూచిస్తున్నాయి. గత త్రైమాసికంలో ఇప్పటికే 17 లక్షల మంది తమ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రస్తుత ఆర్ధిక మాంద్యంపై సోషల్ మీడియాలో భిన్న కధనాలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో వాస్తవ పరిస్థితులను వివరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: