వినాయక నిమజ్జనంలో ఘోరం చోటుచేసుకుంది. నిమజ్జనంలో భాగంగా పంపిన చేసిన పులిహోర తిని 85మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీం నగర్ జిల్లా గంగాధర్ మండలం లింగంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. బుధవారం రాత్రి నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో పులిహోర తిన్న వారిలో 85 మంది అస్వస్ధతకు గురయ్యారు.                                                                       


వాంతులు, విరోచలనతో 85 మంది తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. దీంతో గంగాధరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ 85 మందిని తరలించారు. తూముల లక్ష్మి, రమ, మల్లవ్వ, గంగ, మల్లవ్వ మరో ఆరుగురికి వైద్యాధికారి సుజాత, సిబ్బంది వైద్యం అందజేశారు. రాచర్ల నాగయ్య, తూముల లక్ష్మి, జాడి అంకిత, వెన్నమనేని రాజవ్వ, నాగం కనకయ్య, జుర్రు కొమురవ్వ, మల్లేశం, ఇరుగురాల లచ్చవ్వ తీవ్ర అస్వస్థతకు గురవగా కరీంనగర్‌లోని ఆసుపత్రికి వెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు.                                                        


అస్వస్ధతకు గురైనవారు చాలామంది ఉండటంతో గ్రామంలోని పీహెచ్‌సీ ఆవరణలోనే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారి సుజాత తెలిపారు. పులిహోరలో దీపాలు వెలిగించే నూనె (సమారు) వాడడమే దీనికి కారణమని సమాచారం. నిజానిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. కాగా లింగంపల్లి గ్రామా సర్పంచి పద్మ, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి వైద్యాధికారితో రాత్రంతా పర్యవేక్షించారు.                                                               


మరింత సమాచారం తెలుసుకోండి: