గత పాలనలో తన నాయకుల ఆగడాలను చూసీచూడనట్టు వెళ్లిన చంద్రబాబుకు ఇప్పుడు అదే మెడుకు చుట్టుకుంటోంది. తన పార్టీలో కీలక పాత్ర పోషించిన నాయకులపై కేసులు నమోదవుతూ పరువు గంగలో కలుపుతున్నాయి. ప్రత్యేకించి ఐదుగురు నాయకుల ప్రవర్తన చంద్రబాబుకు తలవంపులు తెస్తోంది. వారు ఎవరంటే.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కూన రవికుమార్, యరపతినేని శ్రీనివాసరావు.


కోడెల శివప్రసాద రావు, ఆయన కుటుంబంపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టును తప్పించుకునేందుకు అనారోగ్యం డ్రామా ఆడుతున్నారని ప్రచారం జరుగుతోంది. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే అరెస్టయ్యారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరో నేత యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణకు అంతా సిద్ధమైంది. ఆయన కూడా అరెస్టుకు సిద్దపడక తప్పని పరిస్థితి నెలకొంది.


ఇక కూన రవికుమార్.. ఉద్యోగులపై దాడి చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసులో ఇరుకున్నారు. ఓ భూవివాదంలో పత్రాలు పోర్జరీ చేశారన్నది ఆయనపై అభియోగం.. అధికారం చేజారగానే ఈ కేసులన్నీ బయటకు రావడంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రత్యేకించి కోడెల శివప్రసాద రావు విషయంలో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు.. కోడెల శివప్రసాదరావు వంటి రౌడీని స్పీకర్ గా పెట్టిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి,ఈనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుది అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. శాసనసభ ఫర్నిచర్‌ను దొంగిలించి తన ఇంట్లో పెట్టుకున్న ఘనుడు కోడెల శివప్రసాద్‌ అని ఎద్దేవా చేస్తున్నారు.


చంద్రబాబు నాయుడి పాలనలో సోమిరెడ్డి చంద్ర మోహన్‌ రెడ్డి, యరపతినేని శ్రీనివాస రావు, కోడెల శివప్రసాద్, చింతమనేని ప్రభాకర్, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వంటి వారు యథేచ్ఛగా భూదందాలు, రౌడీయిజం సాగించారని ఆరోపిస్తున్నారు. తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేయడంపై రాష్ట్రమంతా నిరసన తెలిపినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: