మన దేశంలో డిమాండ్‌కు తగ్గ రైళ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాంప్రదాయ రైళ్లు.. కాలంచెల్లిన రైళ్లలో ప్రయాణాలు చేయాలంటే గంటలకొద్ది ఆలస్యం అవుతోంది. ఫలితంగా ఇది దేశ ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ లను మోడీ సర్కార్ ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాలను తాజాగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి ట్రైన్ 2023 డిసెంబర్లో పట్టాల మీదకు రానుంది.


ముంబై - గుజరాత్ లో తిరిగే ఈ ట్రైన్ మొత్తం 35 ట్రిప్పులు తిరగనుంది. 508 కిలోమీటర్ల దూరాన్ని అతి తక్కువ టైంలో చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది ట్రైన్ టికెట్ ప్రైమరీ రేటు రూ. 3000 గా ఉండనుంది. ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం ముంబయి-అహ్మదాబాద్ మధ్య కనీసం ప్లైట్ టిక్కెట్ రేటే 1500 నుంచి 2500 వ‌ర‌కు ఉంది. దీని కంటే బుల్లెట్ ట్రైన్ టిక్కెట్ రేటు ఎక్కువగా ఉంది.


విమాన టికెట్ కు మించి బుల్లెట్ ట్రైన్ టికెట్ ఉండటంతో ప్రయాణికులు బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతారా ? అన్న డౌట్లు కూడా వ‌స్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 1380 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ.ల‌క్ష కోట్లు అనుకుంటే..అందులో భూసేక‌ర‌ణ కోస‌మే రూ.17 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాయి. మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్ గుజరాత్.. దాద్రానగర్ హైవేలీ కేంద్రపాలిత ప్రాంతంలోనూ నడవనుంది.


ఇక ట్రైన్ ఆగే స్టేష‌న్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి...
థానె -  విరార్ -  బాయ్సర్ - వాపి - బిలిమోరా - సూరత్ - భారుచ్ - వడోదరా -  ఆనంద్ / నదియాద్ - అహ్మదాబాద్ - సబర్మతి



మరింత సమాచారం తెలుసుకోండి: