ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అనుభవం లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటే అవుతుందని పదే పదే నిరూపించుకుంటున్నాడు. వంద రోజుల పాలనలో జగన్ చాలానే చేశారు, చేస్తున్నారు. పాత రోత ట్రెడిషనల్ విధానాలకు ఆయన  స్వస్తి పలకడమే కాకుండా  తనదైన మార్పు కోసం  మార్క్ కోసం  పదమూడు జిల్లాల ఏపీ కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి. 


అభివ్రుధ్ధి అంటే ఒకే చోట కుప్పపోసి ఉండడం అన్నది హైదరాబాద్ మార్క్ డెవ‌లప్మెంట్. ఏపీ విషయం అలా కాదు, కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని అందువల్ల ఇపుడున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని  సమగ్రమైన అభివ్రుధ్ధి చేసుకునే అవకాశం ఏపీకి చాలానే ఉంది. పాత పద్ధతిలో మూస విధానంలో రాజధాని పెద్దదిగా  ఉండాలి. అన్నీ అక్కడే పెట్టాలి. పదమూడు జిల్లాల నుంచి జనం ప్రతీ రోజూ అక్కడికి పరుగులు తీయాలన్న ఫిలాసఫీకే జగన్ సర్కార్ దూరంగా ఉంటోంది. అందువల్లనే వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునుంచే ఏపీ సమగ్ర అభివ్రుధ్ధి నినాదాన్ని అందుకుంది. అందుకోసం చేయాల్సినదంతా  చేస్తోంది కూడా.


ఈ ఈ నేపధ్యంలో   అమరావతితో పాటు ఏపీ సమగ్ర అభివ్రుద్ధి కోసం ఆయా రంగాల్లో నిపుణులైన వారితో జగన్ ఎక్స్ పెర్ట్ కమిటీని నియమించారు. ఈ కమిటీ అమరావతిని ఎలా డెవలప్మెంట్ చేయాలి. ఏపీలో ఎలా  అన్ని విధాలా ప్రగతి బాట పట్టించాలన్న దానిపై పూర్తి స్థాయిలో పరిశీలించి ఆరు వారాలలో గడువులోగా నివేదిక ఇస్తుంది. ఈ కమిటీలో ఎందరో ప్రతిభ కలిగిన వారు ఉండడం విశేషం.
ఆ కమిటీ సభ్యుల వివరాలను చూస్తే  న్యూఢిల్లీకి చెందిన స్చూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్క్తిటెక్చర్ అకడమిక్ డీన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ మహాదేవ్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్, అహ్మదాబాద్ కి చెందిన సిఈపీటీ ప్రొఫెసర్ శివానందస్వామి, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్  టీ రవీంద్రన్, చెన్నైన్ కి చెందిన చీఫ్ అర్బన్ ప్లానర్ (రిటైర్డ్) డాక్టర్ కేవీ అరుణాచలం ఉంటారు.


ఈ కమిటీకి కన్వీనర్ గా రిటైర్డ్  ఐఏఎస్ జీఎస్ రావు వ్యవహరిస్తారు. ఈ కమిటీ అమరావతి రాజధాని పరిస్థితులను కూడా అంచనా వేస్తుంది. అంతే కాదు, పర్యావరణ సమస్యలు, వరదల నిర్వహణ వంటి వాటి విషయలోనూ లోతైన అధ్యయనం జరిపి ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను ఇస్తుంది.   అదే విధంగా ఏపీలో పూర్తి అభివ్రుధ్ధి ఎలా చేయవచ్చు, ఏఏ జిల్లాల్లో అభివ్రుధ్ధి ఎలా చేయవచ్చు అన్నది కూడా నివేదికలో స్పష్టంగా చెబుతుంది.ఈ కమిటీ ఏర్పాటు ద్వారా జగన్ అభివ్రుధ్ధి వికేంద్రీకరణకు ఓ అడుగు ముందుకేశారనుకోవాలి. అలాగే అమరావతి రాజధాని విషయంలోనూ ఎవరూ వంక పెట్టకుండా కచ్చితమైన నిర్ణయాలను తీసుకోవడానికి జగన్ కి ఈ ఎక్స్ ప‌ర్ట్ కమిటీ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: